Site icon Prime9

IQ00 Z7 5G : ఐక్యూ జెడ్7 5జీ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లు.. మీకోసం ప్రత్యేకంగా !

IQ00 Z7 5G mobile phone price and specifications details

IQ00 Z7 5G mobile phone price and specifications details

IQ00 Z7 5G : ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పలు రకాల మొబైల్ కంపెనీల్లో.. ఐక్యూ డబుల్ జీరో కూడా ఒకటి. కస్టమర్లను ఆకర్షించే విధంగా కొత్త ఫీచర్లతో భారత్ లో మార్కెట్ ను విస్తరించుకుంటూ పోతుంది ఈ కంపెనీ. కాగా తాజాగా ఐక్యూ జెడ్7 5జీ స్మార్ట్ ఫోన్ మన దేశంలో లాంచ్ అయింది. ఇప్పటికే సేల్ కూడా ప్రారంభం అయింది. ఈ క్రమలోనే ఈ ఫోన్‌లో ధర, ఫీచర్లు మీకోసం ప్రత్యేకంగా..

ధర..

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. ఇక హైఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద 6 జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.17,499కు, 8 జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.18,499కి కొనుగోలు చేయవచ్చు. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సేల్ కూడా ఇప్పటికే మొదలైంది.

ఫీచర్లు.. 

ఇందులో 6.38 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. కెపాసిటివ్ మల్టీ టచ్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు.

ఇక సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ఇందులో ఉంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, దీంతోపాటు 44W ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ కూడా అందించారు. వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్టును అందించారు. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 173 గ్రాములుగా ఉంది.

ఈ ఫీచర్లతో ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Exit mobile version