Site icon Prime9

iPhone 17 Air Model Leaks: గేమ్ ఛేంజింగ్ ఫీచర్స్.. భారీ అప్‌డేట్స్‌తో ఐఫోన్ 17 ఎయిర్.. డోంట్ మిస్

iPhone 17 Air Leaks

iPhone 17 Air Leaks

iPhone 17 Air Model features Leaked: ఈ సంవత్సరం కొత్త ఐఫోన్లు లాంచ్ అవుతాయని మీరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? మీకు శుభవార్త ఉంది. నిజానికి, ఇటీవల రాబోయే ఐఫోన్ 17 సిరీస్‌కు సంబంధించిన అప్‌గ్రేడ్‌లు, డిజైన్ మార్పులకు సంబంధించి అనేక లీక్‌లు బయటకువస్తున్నాయి. ఈసారి, ప్రో మోడల్ మాత్రమే కాకుండా, కొత్త ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ కూడా వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇది ఈ సిరీస్‌లో అత్యంత సన్నని ఐఫోన్ కావచ్చు. దీనితో పాటు, యాపిల్ ఇన్-హౌస్ 5G మోడెమ్‌ను ఈ మొబైల్‌లో అందించవచ్చని చెబుతున్నారు. ఫోన్ కెమెరా సెటప్ నుండి డిస్‌ప్లే వరకు, ఈసారి 5 గేమ్-ఛేంజింగ్ అప్‌గ్రేడ్‌లను కొత్త ఫోన్‌లో చూడచ్చు. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

 

Slim Design
ఐఫోన్ 17 ఎయిర్ యాపిల్ అత్యంత సన్నని ఐఫోన్ కావచ్చు. దీని మందం కేవలం 5.5 మిమీ మాత్రమే ఉంటుంది. దీని ప్రకారం, ఈ ఫోన్ ఐఫోన్ 6 కంటే సన్నగా ఉండబోతోంది, దీని మందం 6.9 మిమీ. స్లిమ్ బాడీని తీసుకురావడం వెనుక ఉన్న కారణం ఫోన్‌ను తేలికగా, పట్టుకోవడానికి మరింత సౌకర్యవంతంగా మార్చడమే కావచ్చు. అయితే ఇది బ్యాటరీ పరిమాణం, కొన్ని ఫీచర్లను కూడా తగ్గించవచ్చు. అయినప్పటికీ, ఈ కొత్త డిజైన్ ఐఫోన్ 17 సిరీస్‌లోని మిగిలిన మోడళ్లలో ఎయిర్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును ఇవ్వగలదు.

 

Single Camera Setup
ఐఫోన్ 17 సిరీస్ రెగ్యులర్ మోడల్ డ్యూయల్ కెమెరాతో రావచ్చు, ఐఫోన్ 17 ఎయిర్ ఒకే కెమెరాతో రావచ్చు. లీక్‌ల ప్రకారం.. ఇందులో 48-మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉండచ్చు. ఇది మొబైల్ వెనుక భాగంలో అందించనుంది. ఇది ఐఫోన్‌లోని సాధారణ కెమెరా బంప్‌లతో పోలిస్తే దీనికి భిన్నమైన రూపాన్ని ఇస్తుంది. ఇందులో జూమ్ ఫీచర్ పరిమితం అయినప్పటికీ, మీరు దానితో మంచి ఫోటోగ్రఫీని చేయగలుగుతారు. ఫోన్ ముందు కెమెరా గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు.

 

Large Disply
చాలా సన్నగా ఉన్నప్పటికీ, ఐఫోన్ 17 ఎయిర్‌లో పెద్ద స్క్రీన్‌ ఉంటుంది, దీని పరిమాణం 6.6, 6.7 అంగుళాల మధ్య ఉండే అవకాశం ఉంది. డిస్‌ప్లే సైజు పరంగా, ఇది సాధారణ ఐఫోన్ 17 కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది, కానీ ఇప్పటికీ ప్రో మాక్స్ మోడల్ కంటే చిన్నదిగా ఉంటుంది. స్థూలమైన ఫోన్ లేకుండా పెద్ద స్క్రీన్ కోరుకునే వినియోగదారులకు, ఈ మోడల్ ఉత్తమ ఎంపిక కావచ్చు.

 

5G Modem
ఈ సన్నని ఐఫోన్‌లో యాపిల్ మరో మార్పు చేయవచ్చు. ఈ మోడల్‌లో యాపిల్ క్వాల్‌కామ్‌కు బదులుగా దాని స్వంత 5G మోడెమ్‌ను ఉపయోగించవచ్చు. ఐఫోన్ 16e తర్వాత ఇన్-హౌస్ మోడెమ్‌ను కలిగి ఉన్న రెండవ ఐఫోన్ ఇది కావచ్చు. సమాచారం ప్రకారం.. ఈ మోడెమ్ 4Gb/s వరకు డౌన్‌లోడ్ వేగాన్ని అందిస్తుంది, కానీ ఇది mmWave 5Gకి సపోర్ట్ ఇవ్వదు.

 

రెగ్యులర్ వేరియంట్ లాగానే, యాపిల్ ఈ మోడల్‌లో కూడా A19 చిప్‌ను ఉపయోగించవచ్చు, అయితే ప్రో మోడల్స్ మరింత శక్తివంతమైన A19 ప్రో చిప్‌సెట్‌తో రావచ్చు. ఇది యాపిల్ ప్రో చిప్ అంత శక్తివంతమైనది కాకపోయినా, మీరు దానిలో అత్యున్నత స్థాయి పనితీరును పొందుతాయి.

Exit mobile version
Skip to toolbar