Site icon Prime9

iPhone 17 Series: అబ్బబ్బ.. మార్కెట్లో ఐఫోన్‌కు తిరుగులేదు.. దిమ్మతిరిగిపోయే ఫీచర్స్‌తో ఐఫోన్‌ 17 సిరీస్..!

iPhone 17 Series

iPhone 17 Series

iPhone 17 Series: టెక్ దిగ్గజం యాపిల్ ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ ఐఫోన్‌లను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో కంపెనీ ఈ ఏడాది కూడా కొత్త సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. రాబోయే సిరీస్‌లో ఐఫోన్ 17 ఉంది. ఐఫోన్ ప్రియులు ఈ సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పరిచయం చేయచ్చు. కొత్త సిరీస్ రావడానికి ఇంకా చాలా సమయం ఉంది కానీ దాని గురించి చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

యాపిల్ కొత్త సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ వంటి నాలుగు ఐఫోన్‌లను విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి కంపెనీ ప్లస్ మోడల్‌కు బదులుగా ఐఫోన్ 17 ఎయిర్‌ను జాబితాలో చేర్చింది. లాంచ్ చేయడానికి చాలా నెలల ముందు, కొత్త సిరీస్ ఐఫోన్‌లకు సంబంధించి అనేక లీక్‌లు బయటకు వస్తున్నాయి. ఐఫోన్ 17 లీక్‌లు బేస్ మోడల్, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో సిరీస్ ఫీచర్లు వెల్లడయ్యాయి. ప్రస్తుతం రాబోయే ఐఫోన్ సిరీస్ ఏ ఫీచర్లను యాపిల్ ప్రకటించలేదు. స్పెసిఫికేషన్‌లతో పాటు, ఐఫోన్ 17 సిరీస్ ధర కూడా వెల్లడైంది. ఈ వివరాలపై ఓ లుక్కేయండి.. !

Big Upgrades In The iPhone 17 Series
చాలా కాలంగా అభిమానులలో కొత్త డిజైన్ ఐఫోన్ కోసం డిమాండ్ ఉంది. ఈసారి ఐఫోన్ 17 సిరీస్ డిజైన్‌లో కంపెనీ పెద్ద మార్పు చేయవచ్చని భావిస్తున్నారు. రాబోయే ఐఫోన్‌ల మందం చాలా తక్కువగా ఉంటుంది, అంటే రాబోయే ఐఫోన్‌లు మునుపటి కంటే చాలా సన్నగా ఉంటాయి. లీక్స్ ప్రకారం.. iPhone 17 సిరీస్ ఫోన్‌ల మందం 5మిమీ నుండి 6.25మిమీ మధ్య ఉంటుంది. కొత్త సిరీస్ ఐఫోన్‌ల బేస్ వేరియంట్‌లో 6.1-అంగుళాల స్క్రీన్, ప్రో సిరీస్‌లో 6.6-అంగుళాల స్క్రీన్ చూడచ్చు.

యాపిల్ ఐఫోన్ 17 ఎయిర్ సిరీస్‌ను ఒకే కెమెరా సెటప్‌తో తీసుకురానుంది. ఈసారి కొత్త సిరీస్ ఐఫోన్‌లలో పూర్తిగా భిన్నమైన కెమెరా మాడ్యూల్‌ను చూడచ్చు. మరోవైపు, దీర్ఘచతురస్రాకార కెమెరా బార్ ప్రో మోడల్‌లో అందుబాటులో ఉంటుంది. ఈసారి కంపెనీ సిరీస్‌లోని అన్ని ఐఫోన్‌లలో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్‌లలో A19 చిప్‌సెట్‌ ఉంటుంది. ఐపోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్‌లో ఫోటోగ్రఫీ కోసం 48MP సెన్సార్ ఉండచ్చు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం రెండు మోడల్‌లలో 24MP కెమెరా ఉండనుంది.

iPhone 17 Series Price
ప్రస్తుతం, ఐఫోన్ 17 సిరీస్ ధరకు సంబంధించి యాపిల్ ఎటువంటి సమాచారం పంచుకోలేదు, అయితే లీక్‌లలో ధర వెల్లడైంది. లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ 17 సిరీస్ బేస్ వేరియంట్ ధర రూ. 79,900 నుండి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 1,44,900 వరకు ఉండచ్చు. కంపెనీ రాబోయే సిరీస్‌ను సెప్టెంబర్ నెలలో ఆవిష్కరించే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version
Skip to toolbar