Site icon Prime9

iPhone 17 Leaks: ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ రివీల్.. కెమెరా, డిస్‌ప్లేలో చాలా పెద్ద మార్పులు.. చూశారా మరీ..!

iPhone 17 Leaks

iPhone 17 Leaks

iPhone 17 Leaks: మీరు కొత్త ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా..? అయితే కొన్ని రోజులు వేచి ఉండటం మంచిది. యాపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేయబోతుంది. ఇందులో చాలా మార్పులు, అధునాతన ఫీచర్లు ఉంటాయి. కొత్త డిజైన్ నుంచి కెమెరా, డిస్‌ప్లే వరకు ఐఫోన్ 17 మీ అంచనాలను మించిపోతుంది. అయితే ఈ కొత్త ఐఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? తదితర వివరాలు తెలుసుకుందాం.

 

Major Changes In Camera Design
ఐఫోన్ 17 ప్రో మోడళ్లలో కెమెరా మాడ్యూల్‌లో అతిపెద్ద మార్పులు రానున్నాయి. యాపిల్ ఈసారి స్క్వేర్ కెమెరా బంప్‌ను హారిజంటల్ కెమెరా బార్ డిజైన్‌తో రీప్లేస్ చేసే అవకాశం ఉంది. అది ఫోన్ మొత్తం వెడల్పులో విస్తరించి ఉంటుంది. అంతే కాకుండా, ఫోన్ తయారీలో పైభాగంలో అల్యూమినియం ఫ్రేమ్, దిగువన గాజు ఉపయోగించనున్నారు. తద్వారా వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అలాగే ఉంటుంది. ప్రో మోడల్ మునుపటి కంటే కొంచెం పెద్దదిగా ఉండచ్చు.

New screen size and improved display
ఐఫోన్ 17 సిరీస్ 6.27 అంగుళాలు, 6.6 అంగుళాల పెద్ద డిస్‌ప్లే అందించే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. దీనితో పాటు, అన్ని మోడళ్లకు ఇప్పుడు 120Hz ప్రోమోషన్ డిస్ప్లే లభిస్తుందని భావిస్తున్నారు, ఇది గతంలో ప్రో మోడళ్లలో మాత్రమే ఉండేది. ఈ డిస్‌ప్లే స్క్రోలింగ్‌ను సున్నితంగా చేయడమే కాకుండా, ఆల్వేస్-ఆన్ డిస్ప్లే వంటి ఫీచర్లకు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్‌లు, క్లాక్, వాల్‌పేపర్ కూడా లాక్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

 

iPhone 17 Air, The Thinnest iPhone
ఈసారి యాపిల్ కొత్త మోడల్ ఐఫోన్ 17 ఎయిర్‌ను విడుదల చేయనుంది, ఇది ఇప్పటివరకు అత్యంత సన్నని ఐఫోన్ అవుతుంది. దీని మందం 5.5 మిమీ మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. 6.6-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఐఫోన్ ప్లస్ మోడల్‌ను భర్తీ చేయగలదు. వెనుక భాగంలో ఒకే ఒక కెమెరా ఉంటుంది, అది హారిజంటల్ కెమెరా బార్‌లోకి సరిపోతుంది. దానితో పాటు C1 మోడెమ్, యాక్షన్ బటన్, కెమెరా బటన్‌ను అందిస్తారనే చర్చ జరుగుతోంది.

 

Support for 8K Video Recording
ఐఫోన్ 17 ప్రో 48MP సెన్సార్‌తో 8K వీడియో రికార్డింగ్ ఫీచర్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఈసారి యాపిల్ వీడియో నాణ్యతకు కొత్త కోణాన్ని ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు 8K రికార్డింగ్ సామ్‌సంగ్ S25 అల్ట్రా, గూగుల్ పిక్సెల్ 9 ప్రో వంటి ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు యాపిల్ కూడా ఈ రేసులోకి ప్రవేశించిందేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఈ ఫీచర్‌ను ఫోన్ ప్రధాన హైలైట్‌గా మార్చగలదు.

Exit mobile version
Skip to toolbar