Site icon Prime9

iPhone 14 Big Price Drop: ఈ అవకాశాన్ని మిస్ చేయకండి.. ఐఫోన్ 14 ధర భారీగా తగ్గింది.. మీ గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చేయండి..!

iPhone 14 Big Price Drop

iPhone 14 Big Price Drop: ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇదిగో శుభవార్త. ముఖ్యంగా మీరు మీ గర్ల్‌ఫ్రెండ్‌కి ఐఫోన్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లయితే, ఈ అవకాశాన్ని మిస్ చేయకండి. iPhone 14 ధర భారీగా తగ్గింది. ఇప్పుడు రూ. 28,910 కంటే ఐఫోన్ 14 తక్కువ ధరకే లభిస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్‌ను తక్కువ ధరకే కొనచ్చు. జేబుపై ఎక్కువ భారం పడకుండా ప్రీమియం ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం. రండి, ఈ ఐఫోన్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

iPhone 14 Offers
ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రూ. 79,900కి విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఐఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర భారీగా తగ్గింది . మీరు క్రోమాలో కేవలం రూ. 50,990కి కొనచ్చు. ఈ ఫోన్ రూ. 28,910 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఇది కేవలం ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే. కానీ, ఇతర ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లతో మీరు ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే, మీరు పెద్ద మొత్తంలో ఆదా చేయచ్చు.

iPhone 14 Bank Offers
ఎంచుకున్న బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై కస్టమర్‌లకు 1,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ ICICI బ్యాంక్, HSBC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్ కార్డ్‌లపై అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో మరింత తక్కువ ధరకు కొనచ్చు. ఫోన్ మిడ్‌నైట్, స్టార్‌లైట్, పర్పుల్, బ్లూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

iPhone 14 Features
ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే కనిష్టంగా 800 నిట్స్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1170 x 2532 పిక్సెల్‌ల రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తాయి. ఫోన్‌లో Apple A15 బయోనిక్ ప్రాసెసర్ ఉంది. ఇది iOS 16తో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 6GB RAM + 128GB స్టోరేజ్, 6GB RAM + 256GB స్టోరేజ్, 6GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి.

ఐఫోన్ 14 మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా , 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ 3279mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 15W, 7.5W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. మీరు అరగంటలో 50శాతం ఛార్జ్ చేయచ్చు. ఈ ఫోన్‌లో స్టీరియో స్పీకర్, 3.5 ఎంఎం జాక్ ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, GPS, లైట్నింగ్ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar