Site icon Prime9

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. ఈ బ్యాంక్ కార్డులపైనే భారీ ఆఫర్లు!

Flipkart Offers

Flipkart Offers

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో సహా అనేక రకాల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా డీల్స్, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, విఐపి మెంబర్లు ఒక రోజు ముందే సేల్ యాక్సెస్ పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఉండే కొన్ని ఉత్తమ డీల్‌లను టీజ్ చేసింది. అనేక బ్యాంక్ య క్రెడిట్/ డెబిట్ కార్డులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి 2024 సేల్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లేదా VIP మెంబర్ అయితే మీరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో కొన్ని టాప్ డీల్‌లను ఒక రోజు ముందుగా అంటే అక్టోబర్ 20న యాక్సెస్ చేయచ్చు. ఇది ఇటీవల పూర్తయిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్ సేల్ తర్వాత వస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి 2024 సేల్ సమయంలో కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై అనేక డీల్‌లను పొందుతారు. అయితే SBI డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10 శాతం అదపు త్గింపు పొందగలరు. సేల్‌కి ముందు ఫ్లిప్‌కార్ట్ టీజ్ చేసిన గరిష్ట డీల్స్‌లో బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు కూడా ఉంటాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి 2024 సేల్ ల్యాండింగ్ పేజీ ప్రకారం.. ఐఫోన్ 15 సేల్ ప్రారంభమైనప్పుడు రూ. 49,999కి అందుబాటులో ఉంటుందని చూపిస్తుంది. కస్టమర్‌లు ఆపిల్ MacBook Air M2ని తగ్గింపు ధరతో కొనుగోలు చేయగలరు. ఇది ఇంకా వెల్లడించలేదు. ఇంతలో లాస్ట్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ మోడల్‌లు సేల్ సమయంలో రూ. 9,999 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ S23 రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి 2024 సేల్ సందర్భంగా రూ. 37,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ప్రకారం వినియోగదారులు Galaxy S23 FEని రూ. 29,249కి ఆర్డర్ చేయచ్చు. రాబోయే సేల్‌లో 64GB స్టోరేజ్‌తో iPad (2021) రూ. 17,499కి ఉంటుంది.

Exit mobile version