Huawei Enjoy 80 Launched: హువావే అధికారికంగా చైనాలో ఎంజాయ్ 80ని లాంచ్ చేసింది. ఇది చైనాలో విడుదలైన మొదటి ఎంజాయ్ 80-సిరీస్ ఫోన్. అయితే ఈ మొబైల్ 5Gకి సపోర్ట్ ఇవ్వదు. ఈ ఫోన్ సరసమైన ధరకు అనేక గొప్ప ఫీచర్లను అందిస్తుంది. ఈ కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్‌లో 6,620mAh భారీ బ్యాటరీ ఉంది. అలాగే ఇందులో ఒకే 50మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది. ఇప్పుడు ఈ కొత్త ఫోన్ ధర, ఫీచర్ల గురించి తదితర వివరాలు తెలుసుకుందాం.
Huawei Enjoy 80 Features And Specifications
హువావే ఎంజాయ్‌లో 80 1604 x 720 రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల LCD HD+ డిస్‌ప్లే ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్,1,000 నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది. ఎంజాయ్ 80లో కిరిన్ 710A ప్రాసెసర్ అందించారు. ఇందులో 4G చిప్‌సెట్ ఉంది, ఇది HarmonyOS 4.0 పై నడుస్తుంది. మొబైల్‌లో 8జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది.
హువావే ఎంజాయ్ 80 40W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన పెద్ద 6,620mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫోటోగ్రఫీ అవసరాల కోసం 50-మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.ఈ ఫోన్ IP64-రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. ఇందులో బ్లూటూత్ 5.1, వై-ఫై 5, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ , IR బోల్స్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, NFC సపోర్ట్ లేదు. త్వరిత యాక్సెస్ కోసం ఫోన్ పక్కన ఒక ప్రత్యేక ఎంజాయ్ X కీ కూడా ఉంది. స్టాండర్డ్ వెర్షన్ 8.25మిమీ మందం , 203 గ్రాముల బరువు ఉంటుంది, అయితే సాదా లెదర్ వెర్షన్ 8.33మిమీ వద్ద కొంచెం మందంగా, 206 గ్రాముల బరువుతో ఉంటుంది.
Huawei Enjoy 80 Price
హువావే ఎంజాయ్ 80 ఇప్పటికే చైనాలో అమ్మకానికి ఉంది. నాలుగు కలర్ లభిస్తుంది – స్కై బ్లూ, స్కై వైట్, యావోజిన్ బ్లాక్ , వైల్డర్‌నెస్ గ్రీన్. ఇది ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అవుతుందా లేదా అనే దానిపై ఇంకా సమాచారం లేదు. దాని వివిధ వేరియంట్ల ధర ఈ క్రింది విధంగా ఉంది-
8GB RAM + 128GB స్టోరేజ్: 1,199 యువాన్లు (సుమారు రూ. 10,051)
8GB RAM + 256GB స్టోరేజ్: 1,399 యువాన్లు (సుమారు రూ. 16,332)
8GB RAM + 512GB స్టోరేజ్: 1,699 యువాన్లు (సుమారు రూ. 14,071)