HONOR 400 Series: హానర్ తన కొత్త ఫ్లాగ్షిప్ HONOR 400 సిరీస్‌ను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో HONOR 400,HONOR 400 Pro ఉన్నాయి. హానర్ 400 సిరీస్ మునుపటి HONOR 200 సిరీస్‌ను భర్తీ చేస్తుంది. అధిక-రిజల్యూషన్ ఫోటోగ్రఫీ, శక్తివంతమైన పనితీరు, AI- ఆధారిత లక్షణాలపై బలమైన దృష్టిని కలిగి ఉంటుంది. రెండు ఫోన్లు ప్రీమియం మిడ్-రేంజ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని 200MP ప్రైమరీ కెమెరా, భారీ 7200mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో వస్తాయి. వాటి స్పెసిఫికేషన్లు, ధర, ఆఫర్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
HONOR 400, HONOR 400 Pro Price
రెండు ఫోన్లు హానర్ అధికారిక వెబ్సైట్లో ఎంపిక చేసిన రిటైలర్లలో అందుబాటులో ఉన్నాయి. హానర్ 400 డెజర్ట్ గోల్డ్, టైడల్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. హానర్ 400 ప్రో లూనార్ గ్రే, మిడ్నైట్ బ్లాక్ రంగులలో లభిస్తుంది.
1. హానర్ 400 12GB+256GB వేరియంట్ ధర USD 346 (సుమారు రూ. 29,635).
2. హానర్ 400 12GB+512GB వేరియంట్ ధర USD 388 (సుమారు రూ. 33,190).
3. హానర్ 400 ప్రో 12GB+256GB ధర USD 471 (సుమారు రూ. 40,310).
4. హానర్ 400 ప్రో 16GB+512GB ధర USD 624 (సుమారు రూ. 53,335).
HONOR 400 Features
హానర్ 400లో 6.67-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్. 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. కెమెరా సెటప్‌లో 200MP ప్రైమరీ సెన్సార్ (f/1.9, OIS), 12MP అల్ట్రా-వైడ్ (f/2.2, OIS), 50MP సెల్ఫీ కెమెరా (f/2.0) ఉంటాయి. 7200mAh బ్యాటరీ కూడా ఉంది, ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది రెండు రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.
HONOR 400 Pro Features
ఈ సిరీస్‌లో హానర్ 400 ప్రో అనేది హై-ఎండ్ మోడల్. దీనిలో 6.7-అంగుళాల OLED డిస్ప్లే ఉంది, ఇది 1080×2412 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్తో పనిచేస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్, గేమింగ్, AI ప్రాసెసింగ్‌లో అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్లో 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. కెమెరా విభాగంలో 200MP ప్రైమరీ సెన్సార్ (f/1.9, OIS), 12MP అల్ట్రా-వైడ్, 50MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్), 50MP సెల్ఫీ కెమెరా (4K వీడియో సపోర్ట్) ఉన్నాయి. దీనిలో 7200mAh బ్యాటరీ ఉంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.