Honda Activa H-Smart: హోండా యాక్టివాకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ లో హోండా టూ వీలర్ మోడల్స్ లో బెస్ట్ సెల్లింగ్ గా యాక్టివా దూసుకెళ్తోంది.
ఎప్పటికప్పుడు అప్డేట్ అయి కస్టమర్లను ఆకర్షిస్తోంది హెండా యాక్టివా.
ఈ క్రమంలోనే యాక్టివా 6జీ వెర్షన్ లో యాక్టివా H-smart ను తీసుకొచ్చింది. మూడు వేరియంట్లో ఈ స్కూటర్ లభిస్తోంది.
అవి స్టాండర్ట్ , డీలక్స్, స్మార్ట్ వేరియంట్లో వస్తున్న ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధరలు రూ. 74,536 , రూ. 77,036, రూ. 80,537 లుగా కంపెనీ నిర్ణయించింది.
H-smart లో అదనపు ఫీచర్లెన్నో..
– హొండాకు మాత్రమే సొంతమైన 5 సరికొత్త టెక్నాలజీ అప్లికేషన్స్ ఈ స్కూటర్ లో ఉంటాయని సమాచారం.
– కొత్తగా వచ్చిన యాక్టివా H-smart లో మరో ఫీచర్ స్మార్ట్ కీ. ఈ ఫీచర్ వెహికల్ ఎక్కడ ఉందో త్వరగా కనిపెట్టవచ్చు.
-కొంచెం దూరం నుంచి అయినా స్కూటర్ ఇంజిన్ ను స్టార్ట్ లేదా స్టాఫ్ చేయొచ్చు.
– ఇందులో 110 సీసీ పీజీఎం-ఎఫ్ఐ ఇస్తున్నారు.
– ఎక్కువ వీల్ బేస్ , లాంగ్ ఫుట్ బోర్డ్ ఏరియాలు ఈ సరికొత్త యాక్టివా లో ఉన్నాయి.
– న్యూ పాసింగ్ స్విచ్, డీసీ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ అదనపు ఫీచర్స్
– ఎన్ హాన్స్ డ్ స్మార్ట్ టంబుల్ టెక్నాలజీ, ఏసీజీ స్టార్ట్ అండ్ ఫ్రిక్షన్ రిడక్షన్ లాంటి టెక్నాలజీ కూడా ఉంది.
– టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ , అడ్జస్టెబుల్ రేర్ సస్పెన్షన్ వంటివి కూడా యాక్టివా H-smart లో ఉన్నాయి.
వినియోగదారులు కోరుకుంటున్న అన్ని మార్పులు కొత్త యాక్టివాలో ఉన్నాయని హోండా సంస్థ తెలిపింది.
ప్రస్తుతం స్కూటర్ మార్కెట్ లో హోండాకు దాదాపు 56 శాతం పైగా వాటా ఉందన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/