Prime9

HMD Skyline 2-HMD Skyline 2 GT: సూపర్ ఫోన్లు వస్తున్నాయ్.. 108MP కెమెరాతో హెచ్ఎండీ రెండు కొత్త ఫోన్లు.. ఫీచర్స్‌ అరాచకం..!

HMD Skyline 2-HMD Skyline 2 GT: హెచ్ఎండీ రెండు కొత్త ఫోన్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ రాబోయే ఈ ఫోన్‌ల పేర్లు HMD Skyline 2, HMD Skyline 2 GT. ఈ ఫోన్‌ల లాంచ్ తేదీ గురించి కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వలేదు. ఇంతలో ఓ టెక్ వీరుడు స్పెసిఫికేషన్‌లను లీక్ చేయడం ద్వారా వినియోగదారుల ఉత్సాహాన్ని పెంచాడు. హెచ్ఎండీ మీమ్స్ ప్రకారం ఈ కొత్త ఫోన్‌లు 108-మెగాపిక్సెల్ మెయిర్ కెమెరా, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లతో వస్తున్నాయి. ఇది కాకుండా, కంపెనీ వీటిలో శక్తివంతమైన ప్రాసెసర్‌ను కూడా అందించబోతోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

HMD Skyline 2-HMD Skyline 2 GT Specifications
లీకైన నివేదిక ప్రకారం, ఈ ఫోన్‌లలో కంపెనీ 1080 x 2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల డిస్‌ప్లేను అందించనుంది. ఈ ఫుల్ హెచ్‌డీప్లస్ pOLED డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. కొత్త ఫోన్లు 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ ఇంటర్నల్‌తో మార్కెట్లోకి తీసుకురావచ్చు. ప్రాసెసర్‌గా మీరు స్కైలైన్ 2 లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ని పొందుతారు. అదే సమయంలో కంపెనీ స్కైలైన్ 2 GT లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ని అందించగలదు.

 

HMD Skyline 2-HMD Skyline 2 GT Camera Features
ఈ ఫోన్‌లలో 108-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుందని, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్లతో వస్తుందని నివేదిక పేర్కొంది. కంపెనీ ఈ ఫోన్లలో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను అందించగలదు. మీరు స్కైలైన్ 2 లో 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను, స్కైలైన్ 2 GT లో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కూడా చూడవచ్చు. సెల్ఫీల కోసం, ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరాను అందించవచ్చు.

 

HMD Skyline 2-HMD Skyline 2 GT Features
బయోమెట్రిక్ భద్రత కోసం, కంపెనీ ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించగలదు. ఫోన్‌ల బ్యాటరీ 5000mAh కావచ్చు. నివేదిక ప్రకారం, స్కైలైన్ 2 33W కి సపోర్ట్ ఇస్తుంది. స్కైలైన్ 2 45W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ ఈ ఫోన్లలో మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా అందించగలదు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే, ఫోన్ ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. కంపెనీ మూడు సంవత్సరాల పాటు ఫోన్‌లకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లను కూడా అందించగలదు.

Exit mobile version
Skip to toolbar