Site icon Prime9

Pixel 9a: బడ్జెట్ కిల్లర్.. పిక్సెల్ నుంచి పిచ్చెక్కించే ఫోన్.. కెమెరా డిజైన్ వేరే లెవల్!

Pixel 9a

Pixel 9a

Pixel 9a: టెక్ కంపెనీ గూగుల్ తన ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 9 లైనప్ బడ్జెట్ వేరియంట్ పిక్సెల్ 9aని విడుదల చేయనుంది. తాజాగా దీనికి సంబంధించి లీక్‌లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో డిఫరెంట్ కెమెరా సెటప్  ఉండే అవకాశం ఉంది. దీని ముందు వేరియంట్ పిక్సెల్ 8aలో ఉన్నట్లుగా కెమెరా బంప్ ఉండదని వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. అలానే ఇందులో అప్‌గ్రేడ్ ఏఐ ఫీచర్లు కూడా ఉంటాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Pixel 9a వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో విడుదల కానుంది. తాజాగా విడుదలైన లీకుల్లో పిక్సెల్ 9a డిజైన్ అందుబాటులోకి వచ్చింది. దీని డిజైన్ మిగిలిన పిక్సెల్ 9 లైనప్‌ల నుండి వేరుగా ఉంటుందని వెల్లడించింది. ఇందులో కెమెరా బంప్ ఉండదని కొత్త లీకైన చిత్రాల నుంచి తెలుస్తుంది.

పిక్సెల్ లైనప్ ఐకానిక్ కెమెరా మాడ్యూల్‌కు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది.  పిక్సెల్ సిరీస్‌లో సిగ్నేచర్ ఫీచర్‌గా మారింది. అయితే  పిక్సెల్ 9aతో మార్పులు చేయబోతోంది. ఈ డిజైన్‌తో కెమెరా నిస్సందేహంగా భిన్నా కిపిస్తుంది కానీ పర్ఫామెన్స్ పరంగా అప్‌గ్రేడ్‌లను చూడవచ్చు. పిక్సెల్ 8aతో పోలిస్తే కొత్త మోడల్ అనేక కొత్త ఫీచర్లు, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లను కూడా పొందుతుంది.

కొత్త పిక్సెల్ 9 లైనప్‌లో పిక్సెల్ 9ఎ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌‌ఫోన్‌గా ఉంటుంది.  ఇతర ప్రీమియం మోడల్‌లతో పోలిస్తే కొంత తక్కువ ధరకే లభిస్తుంది. ఇది పిక్సెల్ 9 సిరీస్ కంటే పెద్ద బెజెల్‌లను కలిగి ఉంటుంది. ఇది కాకుండా వినియోగదారుల సాఫ్ట్‌వేర్ అనుభవం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 15 తో వస్తున్న మొదటి ఫోన్. కంపెనీ ఏడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లను అందించబోతోంది.

ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే పిక్సెల్ 9a 6.1-అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనిలో Pixel 8a కంటే పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఇది కాకుండా ఫోన్  ఇంటర్నల్ టెన్సర్ G4 చిప్‌సెట్‌తో అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తోంది.  ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB RAMతో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

Exit mobile version