Google Pixel 9a Launch: భారతీయ మొబైల్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న “Google Pixel 9a” స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు విడుదలైంది. A సిరీస్‌లో కంపెనీ ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది. ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది సరైన ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. ఏప్రిల్ 16న విడుదల కానుంది. మూడు కలర్ వేరియంట్లలో ఫోన్‌ని కొనుగోలు చేయచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు టెన్సర్ G4 ప్రాసెసర్ సపోర్ట్ ఉంది. మీరు కూడా ఈ ఫోన్ కొనాలని చూస్తుంటే.. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Google Pixel 9a First Sale
గూగుల్ పిక్సెల్ 9ఏ ఏప్రిల్ 16 భారత్‌లో సేల్‌కి రానుంది. అయితే దాని డెలివరీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది వెల్లడించలేదు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ భాగస్వాముల నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు. మొదటి సేల్ సమయంలో లాంచ్ ఆఫర్ కింద పెద్ద తగ్గింపులను కూడా చూడచ్చు. గూగుల్ పిక్సుల్ 9ఏని మూడు కలర్ వేరియంట్‌లతో వస్తుంది. ఇందులో అబ్సిడియన్, పింగాణీ, ఐరిస్ కలర్స్ ఉన్నాయి.
Google Pixel 9a Price
గూగెల్ పిక్సెల్ 9ఏ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో లాంచ్ అవుతుంది. ఇది సింగిల్ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 49,999 ధరకు కంపెనీ దీనిని భారత మార్కెట్లో విడుదల చేసింది. గూగుల్ ఈ స్మార్ట్‌ఫోన్ మరొక వేరియంట్‌ను అమెరికా,ఇతర మార్కెట్‌లలో 128జీబీ స్టోరేజ్‌త్‌తో ప్రవేశపెట్టింది.
Google Pixel 9a Features
గూగుల్ పిక్సెల్ 9ఏ డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. ఇందులో కంపెనీ 6.3 అంగుళాల pOLED Actua డిస్‌ప్లేను అందించింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా 3 ప్రొటక్షన్ అందించారు. స్మార్ట్‌ఫోన్‌లో గరిష్టంగా జీబీ వరకు ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు టెన్సర్ G4 ప్రాసెసర్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 48 + 13 సెన్సార్ అందుబాటులో ఉంది. కంపెనీ 23W ఛార్జర్‌తో 5100mAh పెద్ద బ్యాటరీని అందించింది.