Site icon Prime9

Diwali Gift: దీపావళి.. ఈ ఫీచర్ ఫోన్లను బహుమతిగా అందించండి.. ధర చాలా తక్కువ!

Diwali Gift

Diwali Gift

Diwali Gift: దీపావళి పండుగకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలా మంది పండగ నాడు  కుటుంబ సభ్యులకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు. మీరు కూడా మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఏదైనా బహుమతిగా ఇవ్వాలనుకుంటే, ఫీచర్ ఫోన్ గుడ్ ఛాయిస్. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఫీచర్ ఫోన్‌లను కూడా  ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ కోసం అలాంటి కొన్ని ఫోన్‌లను తీసుకువచ్చాము. వాటి గురించి విరంగా తెలుసుకుందాం.

Nokia All-New 105
ఇది నోకియా స్పెషల్ ఫీచర్ ఫోన్. లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఫోన్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 2000 కాంటాక్ట్‌లు, 500 ఎస్ఎమ్‌ఎస్‌లను లను సేవ్ చేయగల స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో మీరు పాత స్నేక్‌ క్లాసిక్ గేమ్ ని కూడా చూస్తారు. ఇది కాకుండా  ఈ ఫోన్‌లో బిల్ట్ ఇన్ రేడియో పొందుతారు. దీని ద్వారా మీరు సంగీతాన్ని వినచ్చ. వైజ్ ఇన్-బిల్డ్ UPI యాప్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్‌తో డబ్బును సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయచ్చు. ఈ ఫోన్ ధర రూ.1249. డ్యూయల్  సిమ్ కార్డ్‌లను ఉపయోగించచ్చు.

Motorola All-New A10
ఇది మోటరోలా ఫీచర్ ఫోన్. 0.03GB RAM + 32GB  ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగి ఉంటుంది. ఈ మోటరోలా ఫోన్‌లో అధునాతన MediaTek ప్రాసెసర్ అందుబాటులో ఉంది. ఫోన్ 800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 10 రోజుల స్టాండ్‌బై సమయంతో వస్తుంది.

ఈ ఫోన్‌లో ఆటో కాల్ రికార్డింగ్, వాయిస్ ఫీచర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌తో మల్టీ టాస్కింగ్ చేయచ్చు. ధర గురించి చెప్పాలంటే మీరు ఈ ఫోన్‌ను అమెజాన్‌లో రూ. 1159కి కొనుగోలు చేయవచ్చు.

Nokia 130 Music
ఇది నోకియా ఫీచర్ ఫోన్. దీనిలో 32 GB స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో అద్భుతమైన కాలింగ్,  లౌడ్ స్పీకర్ ఉన్నాయి. ఈ నోకియా ఫోన్‌లో ప్రత్యేకమైన మ్యూజిక్ బటన్ ఉంది. ఈ ఫోన్ పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఇది 30 రోజుల స్టాండ్‌బై లైఫ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో కూడా మీరు FM రేడియో  పొందుతారు. దీనిలో మీరు కోరుకున్న ఛానెల్‌ని ఎంచుకోవచ్చు. ధర గురించి చెప్పాలంటే దీనిని రూ. 1846కి కొనుగోలు చేయవచ్చు

Exit mobile version