Site icon Prime9

Valentines Day Mobile Gifts: సెలబ్రేట్ లవ్.. మీ ప్రియమైన వారికి వాలెంటైన్ గిఫ్ట్‌ ఇవ్వాలా? ఈ స్మార్ట్ ఫోన్లు ట్రై చేయండి..!

Valentines Day Mobile Gifts

Valentines Day Mobile Gifts: మీరు ఈ సంవత్సరం వాలెంటైన్స్ డేని మీ ప్రియురాలితో ప్రత్యేకంగా చేయాలనుకుంటే ఇప్పుడే ప్లాన్ చేయండి. విహారయాత్ర లేదా అనేక ఇతర కార్యకలాపాలకు వెళ్లడం ద్వారా మీ వాలెంటైన్స్ డేని సరదాగా చేసుకోండి. ఈ ప్రేమికుల రోజున మీ స్నేహితురాలు లేదా భార్యకు ఏదైనా బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా? అలా అయితే, చివరి నిమిషంలో ఏదైనా ఇచ్చే బదులు ఇప్పుడే ప్లాన్ చేయండి. ముఖ్యంగా మీరు మీ స్నేహితురాలికి బహుమతిగా ఇవ్వడానికి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఇదిగో బెస్ట్ ఫోన్‌లు!

స్మార్ట్‌ఫోన్‌లు అమ్మాయిలకు బాగా నచ్చుతాయి. ప్రస్తుతం ఫోన్లు వాడని అమ్మాయిలు ఉండరు. కాబట్టి, వాలెంటైన్స్ డే కోసం మీ అమ్మాయికి స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇవ్వండి. అవును, ప్రేమికుల రోజున మీ స్నేహితురాలికి బహుమతిగా ఇవ్వడానికి మీరు ఉత్తమమైన ఫోన్ కోసం చూస్తున్నట్లయితే చింతించకండి. కాబట్టి, ఈ కథనంలో మీ భాగస్వామి ఇష్టపడే కొన్ని తాజా ఫోన్‌లను తీసుకొచ్చాము.  వీటిని కొని బహుమతిగా ఇవ్వడం ద్వారా మీరు మీ భాగస్వామి నుండి ప్రేమను పొందచ్చు.

OnePlus Nord 4 5G
మీరు ఈ వాలెంటైన్స్ డేకి OnePlus Nord 4 5Gని బహుమతిగా ఇవ్వచ్చు. 30,000 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది 12GB RAM + 256GB స్టోరేజ్, 6.74 అంగుళాల డిస్ప్లే, 5500mAh బ్యాటరీతో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. మీరు ఈ ఫోన్‌ను మెర్క్యురియల్ సిల్వర్, అబ్సిడియన్ మిడ్‌నైట్, ఒయాసిస్ గ్రీన్ కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Nothing Phone (2a) 5G
మీరు ఈ ప్రేమికుల రోజున మీ భాగస్వామికి నథింగ్ ఫోన్ (2a) 5Gని బహుమతిగా ఇవ్వచ్చు. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ + 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,  32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ ఉంది. అలాగే 12GB + 256GB స్టోరేజ్, 6.7 AMOLED డిస్ప్లే, 5000mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ బ్లాక్,గ్రే కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Oppo F27 Pro+ 5G
ప్రేమికుల రోజున మీ స్నేహితురాలికి బహుమతిగా ఇవ్వడానికి OPPO F27 Pro+ 5G మొబైల్ ఒక గొప్ప ఎంపిక. ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అలాగే 8GB + 256GB స్టోరేజ్, 6.7 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ డస్క్ పింక్ , మిడ్‌నైట్ నేవీ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

CMF Phone 1
మీరు మీ స్నేహితురాలు లేదా భార్యకు CMF ఫోన్ 1ని బహుమతిగా ఇవ్వవచ్చు. గేమింగ్ ప్రియులు దీన్ని ఇష్టపడతారు. ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ మెయిన్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB + 128GB స్టోరేజ్, 6.67 అంగుళాల AMOLED డిస్ప్లే, 5000mAh కెపాసిటీ బ్యాటరీతో సహా అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

Moto G64 5G
మోటో స్మార్ట్‌ఫోన్‌లు అమ్మాయిలకు బాగా నచ్చుతాయి. కాబట్టి, మీరు Moto G64 5G ఫోన్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ 7025 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12GB + 256GB స్టోరేజ్, 6.5-అంగుళాల డిస్ప్లే,6,000mAh బ్యాటరీని కూడా ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar