Site icon Prime9

OnePlus Offers: వన్‌ప్లస్ ఆఫర్ల రచ్చ.. ఈ ఫోన్లను చాలా చీప్‌గా కొనండి..!

OnePlus Offer

OnePlus Offer

OnePlus Offers: దీపావళి సందర్భంగా స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లను అందిస్తోంది. పలు కంపెనీలకు చెందిన మొబైల్స్ తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. మీరు వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీని కేవలం రూ.15,000కే కొనచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్, ఈఎమ్ఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఫోన్‌పై ఎంత తగ్గింపు లభిస్తుంది? ఫీచర్లు ఎలా ఉన్నాయి? దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

OnePlus Nord CE 3 Lite 5G
ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో స్టైలిష్ లుక్స్, అద్భుతమైన ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.72 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ మొబైల్‌లో 108 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. అంతేకాకుండా ఇది 5000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా చాలా ఫీచర్లను ప్యాక్ చేస్తది. ఫోన్ అసలు ధర రూ. 19,999. ఆఫర్లపై రూ. 15,684 కొనుగోలు చేయచ్చు. అంటే రూ.  4,315 తగ్గింపు లభిస్తుంది.

OnePlus Nord CE 4 Lite 5G
ఈ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. ఉంది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 15,684కే అందుబాటులో ఉంది. మీరు ఈ వన్‌ప్లస్ ఫోన్‌ని రూ. 4,315కి పొందవచ్చు. (21 శాతం) తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీనికి బ్యాంకు కార్డులు అవసరం లేదు. మీరు ఈ ఫోన్‌ను లైమ్, గ్రే కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

OnePlus Nord CE 3 Lite 5G Features
ఈ 5G ఫోన్‌లో 6.72 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. ఇది 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్ప్లే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 391 ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఇది P3 కలర్ కామెట్ అందుబాటులో ఉన్న ఐ కంఫర్ట్ డిస్‌ప్లే.ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, వన్‌ప్లస్ ఆక్సిజన్‌తో రన్ అవుతుంది. ఆండ్రెనో 619 GPU గేమింగ్ అవుట్‌పుట్‌తో అందుబాటులో ఉంది. మొబైల్ 8GB RAM + 128GB,  8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్ (హైబ్రిడ్ స్లాట్) ప్యాక్ చేయబడింది. 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ అందుబాటులో ఉంది.

ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది సామ్‌సంగ్ ISOCELL HM6తో 108-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. ఇది 2 మెగాపిక్సెల్ ఆక్సిలరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కూడా కలిగి ఉంది. వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. ఇది 1080p వీడియో రికార్డింగ్, 720p స్లో మోషన్ రికార్డింగ్‌తో వస్తుంది. 6x జూమింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది. కంపెనీ వన్‌ప్లస్ నార్డ్ సిఈ 3 లైట్‌ని 5000mAh బ్యాటరీతో విడుదల చేసింది. ఇది 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు, సైడ్మౌం టెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Exit mobile version