Site icon Prime9

Motorola Edge 50 Fusion: మోటో ఆఫర్లు.. ఈ ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇంకా చాలా ఉన్నాయ్!

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion: ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఎంపిక చేసిన మొబైల్స్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ స్పెషల్ సేల్‌లో కొన్ని కొత్త ఫోన్‌లతో పాటు సేల్స్‌లో టాప్‌లో ఉన్న ఫోన్లు ఉన్నాయి. వాటిలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కూడా ఉంది. ఈ మొబైల్‌పై వావ్ అఫర్ ప్రకటించింది. ఫోన్‌పై 15 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ప్రస్తుతం ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కి ఉంది. కంపెనీ దీని ధరపై 15 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని కారణంగా 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 21,999కి కొనచ్చు.

ఇది కాకుండగా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌పై కూడా ఈ మొబైల్ దక్కించుకోవచ్చు. ఈ ఫోన్ Qualcomm Snapdragon 7s Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 5,000 mAh బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.

Motorola Edge 50 Fusion Features
మోటరోలా Edge 50 Fusion ఫోన్ 2400 × 1080p పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల 3D కర్వ్డ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్‌లో 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 144Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి. మొబైల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్7s Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో Android 14 OSకి సపోర్ట్ ఇస్తుంది.

ఈ ఫోన్‌లో 8GB + 128GB, 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌లు ఉన్నాయి. మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అందులో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్ ఉంది. ఈ మొబైల్ సెల్ఫీ కెమెరాలో 32 మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది.

మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, డాల్బీ అట్మోస్ ఆడియో, 5G, GPS, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, USB 2.0 టైప్ సి పోర్ట్ ఆప్షన్లను కూడా కలిగి ఉంది.

Exit mobile version