Flipkart Big Bachat Days Sale: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రెండు రోజుల క్రితం బ్లాక్ ఫ్రైడే సేల్ ముగిసింది. ఆ తర్వాత వెంటనే బిగ్ బచాట్ డేస్ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్చ ఈరోజు నుంచి డిసెంబర్ 5 వరకు లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో మీరు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలతో పాటు ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపులను పొందుతారు. అలానే మీరు కొత్త 4K స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకు గొప్ప అవకాశం. సేల్ సమయంలో 43 అంగుళాల 4K స్మార్ట్‌టీవీలు కేవలం రూ.20,999 స్టార్టింగ్ ప్రైస్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సేల్‌లో అందుబాటులో ఉన్న టాప్ 3 డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Hisense E6N
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచాట్ డేస్ సేల్‌లో ఈ టీవీ కేవలం రూ. 23,999కి 46 శాతం వరకు తగ్గింపుతో లభిస్తుంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా టీవీలో రూ. 1,000 అదనపు తగ్గింపును పొందవచ్చు. TV 4K అల్ట్రా HD రిజల్యూషన్‌తో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని కలిగి ఉంది. ఇది మాత్రమే కాదు Google TV ఇంటిగ్రేషన్‌తో టీవీలో కంటెంట్ రెకమండేషన్ అందుబాటులో ఉంది. Dolby Vision, Dolby Atmos సపోర్ట్ టీవీ సౌండ్, విజువల్ క్వాలిటీని బెటర్‌గా చేస్తుంది. టీవీలో 24W స్పీకర్ అవుట్‌పుట్‌తో పాటు AI పిక్చర్ ఇమ్‌ప్రూవ్‌మెంటు, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది.
Sansui
ఈ టీవీ కేవలం రూ. 20,999కి 40 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీనిలో 4K అల్ట్రా HD డిస్‌ప్లే ఉంటుంది. ఇది క్లియర్ పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. టీవీకి ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ కూడా ఉంది. ఇది కాకుండా, టీవీ 20W స్పీకర్ అవుట్‌పుట్, DTS స్టూడియో సౌండ్ టెక్నాలజీని అందిస్తోంది. ఇంటర్నల్‌గా Chromecast, వాయిస్ రిమోట్ కంట్రోల్ టీవీని మరింత మెరుగ్గా చేస్తుంది.
MOTOROLA EnvisionX
మోటరోలా ఈ టీవీ కూడా 20,999 రూపాయలకు మాత్రమే సేల్‌లో అందుబాటులో ఉంది. టీవీలో 59 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇది ఉత్తమమైన డీల్. QLED డిస్‌ప్లే టెక్నాలజీతో కూడిన ఈ టీవీ డీప్ కలర్స్, హై కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్‌తో సినిమాటిక్ పిక్చర్ క్వాలిటీని కూడా కలిగి ఉంది. 40W స్పీకర్ అవుట్‌పుట్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఆడియో క్వాలిటీ నెక్స్ట్ లెవల్‌కి తీసుకువెళుతుంది.