Site icon Prime9

Flipkart New Sale: ఓ వైపు వర్షాలు.. మరోవైపు ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్ సరికొత్త సేల్.. ఈ మూడు మోటో ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు..!

Flipkart New Sale

Flipkart New Sale

Flipkart New Sale: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ మరోసారి ఆఫర్లు వర్షం కురిపిస్తోంది. బిగ్ బచాట్ డేస్‌ సేల్‌తో భారీ డిస్కౌంట్లను తీసుకొచ్చింది. డిసెంబర్ 5 వరకు జరిగే ఈ సేల్‌లో మీరు భారీ తగ్గింపులతో టాప్ కంపెనీల బెస్ట్ స్మార్ట్‌ఫోన్లను ఆర్డర్ చేయొచ్చు. అలానే మీరు మోటో ఫ్యాన్స్ అయితే ఈ సేల్‌ని అసలు మిస్ చేయద్దు. డీల్స్‌లో మోటరోలా స్మార్ట్‌ఫోన్లపై రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ డీల్‌లో మీరు బంపర్ ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కూడా ఈ ఫోన్‌లను కొనుగోలు చేయచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో మోటరోలా ఫోన్లపై అందుబాటులో ఉన్న మూడు డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Motorola G85 5G
8 GB RAM +128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ Motorola ఫోన్ వేరియంట్ ధర రూ.17,999. బ్యాంక్ ఆఫర్‌లో మీరు దీన్ని రూ. 1500 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి Flipkart Axis బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 16,500 వరకు బెనిఫిట్ పొందవచ్చు.  ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే పొందుతారు. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. మీరు సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడచ్చు.

Motorola Edge 50 Pro 5G
12 GB RAM+ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.31,999. మీరు బ్యాంక్ ఆఫర్‌లలో దీని ధరను రూ. 2,500 వరకు తగ్గించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించే వినియోగదారులు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. సేల్‌లో ఫోన్‌పై రూ.30,300 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. కంపెనీ ఫోన్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లేను ఇస్తోంది. ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్,సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్స్. మీరు ఈ ఫోన్‌లో 4500mAh బ్యాటరీని పొందుతారు. ఈ బ్యాటరీ 125 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Motorola Edge 50 Fusion
ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. 12 GB RAM+ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.24,999. 2500 వరకు తగ్గింపుతో సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కంపెనీ రూ.23,200 వరకు తగ్గింపును ఇస్తోంది. ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ ఫోన్‌లో 6.7-అంగుళాల pOLED కర్వ్డ్ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇన్‌స్టాల్ చేశారు. సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరాను చూడచ్చు.

Exit mobile version