Site icon Prime9

Realme C61: ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్.. రూ. 7,699లకే రియల్‌మి ఫోన్..!

Realme C61

Realme C61

Realme C61: దీపావళి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో రియల్‌మి కంపెనీకి చెందిన Realme C61 ధర భారీగా తగ్గుతుంది. ఈ ఫోన్  4GB + 64GB, 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఫోన్‌పై 14 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో Realme C61పై 14 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ మొబైల్ 4 GB RAM + 64 GB స్టోరేజ్ వేరియంట్‌ ధర 7,699. అదనంగా కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల నుండి డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.ఈ మొబైల్ 4GB + 64GB, 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌లతో పాటు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది ఇప్పుడు డైమండ్ డస్ట్ బ్లాక్, ఎథెరియల్ బ్లూ, మిస్టికల్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లను పొందుతుంది. కాబట్టి Poco C61 స్మార్ట్‌ఫోన్‌లో ఏ ఇతర ఫీచర్లు ఉన్నాయో చూద్దాం.

Poco C61 Features
ఈ మొబైల్‌లో 6.71-అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇది 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తోంది. దీనితో పాటు ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను పొందుతుంది. ఇది VR GE8320 GPU సపోర్ట్‌తో MediaTek Helio G36 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ 14 ఓఎస్ సపోర్ట్ కూడా ఉంది.  ఈ ఫోన్‌లో 4GB + 64GB, 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌లు ఉన్నాయి. 6GB వరకు వర్చువల్ RAM  సపోర్ట్ చేస్తుంది.

Poco C61 మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.  దాని మెయిన్ కెమెరా 8 మెగా పిక్సెల్. రెండవ కెమెరా మెయిన్ లెన్స్ సపోర్ట్ కలిగి ఉంది. ముందు భాగంలో సెల్ఫీలు,  వీడియో కాల్‌ల కోసం 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.

Poco C61 మొబైల్ 5,000 mAh బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇది 10W వైర్డ్ ఛార్జింగ్ ఎంపికను పొందుతుంది. ఇందులో USB టైప్-C పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, 3.5mm ఆడియో జాక్ ఆప్షన్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా 4G LTE, బ్లూటూత్ వెర్షన్ 5.4, Wi-Fi 5 ఎంపికలను కూడా పొందుతుంది. ఇప్పుడు ఈ మొబైల్ డైమండ్ డస్ట్ బ్లాక్, ఎథెరియల్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Exit mobile version