Site icon Prime9

Flipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. ఇవన్నీ సగం ధరకే.. లిస్టులో ఐఫోన్లు, మోటో ఫోన్లు!

Flipkart Diwali Sale

Flipkart Diwali Sale

Flipkart Time Bomb Deals: ఈ కామర్స్ సంస్థలు వరుస ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి  చేస్తున్నాయి. గత నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఉత్సవ్ సేల్‌ను నిర్వహించింది. ఇప్పుడు మరొక సేల్ ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా దీపావళి సేల్ ప్రకటించింది తన వినియోగదారులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.  ఈ సేల్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగా అక్టోబర్ 20న దీన్ని యాక్సెస్ చేయచ్చు.

ఫ్లిప్‌కార్ట్  మునుపటి సేల్ మాదిరిగానే దుమ్మురేపే ఆఫర్లను అందిస్తుంది. ఎంపిక చేసిన ఉత్పత్తులను చాలా చౌకగా దక్కించుకోవచ్చు. ధరలో కూడా చాలా మార్పులు ఉంటాయని వెల్లడించింది. దీపావళి సేల్ సమయంలో అందుబాటులో ఉన్న అన్ని డీల్స్‌ను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.  టీజర్ ప్రకారం వినియోగదారులకు ఐఫోన్ 15 ప్లస్, మోటో జి 85 వంటి స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో రూ.29,999కి అందుబాటులో ఉటుది. ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని ధర రూ. 35,999. అంటే ఇప్పుడు రూ. 6,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.30,000 లోపే ఆర్డర్ చేయచ్చు. ఇతర ఆఫర్లతో దీని ధర రూ.27,999గా ఉంటుంది.

ఈ సేల్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర రూ. 21,999. కాగా మోటరోలా ఎడ్జ్ 50 నియో రూ. 23,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సందర్భంగా Moto G85 స్మార్ట్‌ఫోన్ రూ.16,999కి అందుబాటులో ఉంటుంది. Moto G45 ధర రూ.9,999కి తగ్గుతుంది. వినియోగదారులు మరింత తక్కువ ధరకు ఫోన్ పొందడానికి కొన్ని బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లను పొందుతారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సమయంలో మరికొన్ని మోటరోలా ఫోన్‌లు కూడా తక్కువ ధరలకు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ప్లాట్‌ఫామ్ ఇంకా మరిన్ని డీల్‌లను వెల్లడించలేదు. అయితే  Poco F6, Pocoపై భారీ ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది.

ఐఫోన్ 15 సేల్‌లో కేవలం రూ.49,999కే అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 15 ప్రో మరోసారి లక్ష కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో దీపావళి సేల్‌లో ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.59,999. సామ్‌సంగ్ గెలాక్సీ S 23 FE సేల్‌లో రూ. 28,999కి దక్కించుకోవచ్చు.

Time Bomb Deals
ఇది మాత్రమే కాదు ఈసారి కంపెనీ టైమ్ బాంబ్ డీల్స్‌ను కూడా తీసుకువస్తోంది. ఇక్కడ మీకు ఒక గంట తక్కువ ధరకు కొన్ని ఫోన్‌లు లభిస్తాయి. టైమ్ బాంబ్ డీల్స్ అక్టోబర్ 20వ తేదీ అర్ధరాత్రి 12 నుండి తెల్లవారుజామున 1 గంటల వరకు లైవ్ అవుతాయి. టీజర్ ప్రకారం ఈ సమయంలో CMF ఫోన్ కేవలం 12,499 రూపాయలకు మాత్రమే.  Oppo K12x 5G కేవలం 10,749 రూపాయలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Exit mobile version