Site icon Prime9

Moto Offers: ఆఫర్ల జాతర స్టార్ట్.. మోటో ప్రీమియం ఫోన్లపై రూ. 7 వేలు డిస్కౌంట్.. ఇక పండగే!

Moto Offers

Moto Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల జాతరను మొదలుపెట్టింది. ఇటీవలే తన బిగ్‌ బిలియన్ డేస్ సేల్ ముగించి, కొత్త షాపింగ్ ఉత్సవ్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఈరోజు అంటే అక్టోబర్ 9 నుంచి ప్రారంభమైంది. సేల్‌లో చాలా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఈ క్రమంలో మీరు కూడా సేల్‌లో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే మోటో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు దక్కించుకోవచ్చు. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్‌పై రూ. 7250 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ గురించి వివరంగా తెలుసుకోండి.

Motorola Edge 50 Pro
మెటో ఎడ్జ్ 50 ప్రో 12GB వేరియంట్‌ను కంపెనీ 35,999 రూపాయలకు ప్రారంభించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ డే సేల్‌లో రూ. 6000 డిస్కౌంట్ ప్రకటించింది. దీని తర్వాత రూ.29,999కి అందుబాటులో ఉంది. ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తోంది. మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌తో ఫోన్‌ను కొనుగోలు చేస్తే, మీకు రూ. 1250 తగ్గింపు లభిస్తుంది. ఇది మొత్తం తగ్గింపు రూ.7250 అవతుంది. లక్స్ లావెండర్, బ్లాక్ బ్యూటీ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో మెటల్ ఫ్రేమ్ డిజైన్, వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో బ్యాక్ ప్యానెల్ ఉంది.

Motorola Edge 50
ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర రూ.21,999. మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ ధర రూ. 23,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ సందర్భంగా Moto G85 స్మార్ట్‌ఫోన్ రూ.16,999కి అందుబాటులో ఉంటుంది. Moto G45 ధర రూ.9,999కి తగ్గుతుంది.

Motorola Edge 50 Pro
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ట్రూ కలర్ పాంటోన్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. ఇది 6.7 అంగుళాల 1.5K పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్యానెల్ HDR10+, 144Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 2,000నిట్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. అలానే ఇందులో AI ఫోటో ఫీచర్లు కూడా ఉన్నాయి. పవర్ కోసం ఫోన్‌లో 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 125W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

కెమెరా విషయానికి వస్తే OISతో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ + మాక్రో విజన్ సెన్సార్, OISతో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. ముందు కెమెరాలో 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.

Exit mobile version