Site icon Prime9

Redmi Note 13 Pro 5G: ఆఫర్ల అరాచకం.. రెడ్‌మీ 5జీ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్..!

Redmi Note 13 Pro 5G

Redmi Note 13 Pro 5G

Redmi Note 13 Pro 5G: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. తాజాగా మరో కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా Redmi Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 200 మెగాపిక్సెల్ కెమెరా, 5100mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఫోన్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్ సందర్భంగా Redmi Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ ధరను రూ.18,982 తగ్గించింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. దీని కారణండా ఈ ఫోన్ ధర రూ. 17,482 అవుతుంది.

కంపెనీ గత ఏడాది ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది మిడ్‌నైట్ బ్లాక్, అరోరా పర్పుల్, ఆలివ్ గ్రీన్, ఓషన్ టీల్ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్‌లను కలిగి ఉంది. అందులో 8GB + 128GB, 12GB + 256GB, 16GB + 512GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1220 x 2712 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో వస్తుంది.

మొబైల్ Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌‌లో రన్ అవుతుంది. దీనితో పాటు ఇది హైపర్ OS తో Android 14 అప్‌డేట్‌ను పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB RAM+128GB స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్ మెమరీ కార్డ్‌ని ఉపయోగించడానికి సపోర్ట్ ఇస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరాలో 8 మెగాపిక్సెల్ సెన్సార్, మూడవ కెమెరాలో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఈ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ 5,100mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ రోజంతా బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. మొబైల్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌తో వస్తుంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, డ్యూయల్ బ్యాండ్, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్ C పోర్ట్ ఉన్నాయి.

Exit mobile version