Site icon Prime9

 Samsung Galaxy S23: రెడీగా ఉండండి.. భారీగా పడిపోయిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 ప్రైస్..!

 Samsung Galaxy S23

 Samsung Galaxy S23

Samsung Galaxy S23: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ అర్ధరాత్రి 12 గంటల నుంచి లైవ్ అవుతుంది. కొత్త సేల్‌లో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందుతారు. అయితే ఇప్పుడు సేల్ ప్రారంభానికి ముందే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 ధర ఊహించని విధంగా పడిపోయింది.

మీరు 5 నుంచి 6 సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేని స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. మీరు Samsung Galaxy S23ని గుడ్డిగా ఆర్డర్ చేయచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 హై స్పీడ్ ప్రాసెసర్, వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను చూస్తారు. ఈ ఫోన్‌పై లభించే డిస్కౌంట్ గురించి వివరంగా తెలుసుకుందాం.

సామ్‌సంగ్ గెలాక్సీ  S23 5G ఒక ప్రీమియం స్మార్ట్‌ఫోన్. దీని 128GB వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 89999. అయితే ప్రస్తుతం మీరు దానిని సగం కంటే తక్కువ ధరకు కొనచ్చు. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ఆఫర్‌లో 55 శాతం తగ్గింపుతో కేవలం రూ.39,999కి క్కించుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లపై ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. SBI క్రెడిట్ కార్డ్ నాన్ EMI లావాదేవీ చేస్తే రూ. 500 తగ్గింపు లభిస్తుంది.

అయితే సామ్‌సంగ్ గెలాక్సీ S23ని మరింత తక్కువ ధరకు కొనాలంటే బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు బలమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్‌లో మీరు రూ.40 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ S23లో కంపెనీ అల్యూమినియం ఫ్రేమ్‌తో గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌ను అందించింది. ఇందులో మీరు IP68 రేటింగ్ ప్రొటక్షన్ కూడా పొందుతారు. డిస్‌ప్లే గురించి మాట్లాడితే ఇది AMOLED ప్యానెల్‌తో 6.1 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ని ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌‌పై రన్ అవుతుంది. దీనిలో 8GB RAM+ 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో 50+10+12 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12MP కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌ పవర్ చేయడానికి 3900mAh బ్యాటరీ ఉంటి.

Exit mobile version