Site icon Prime9

iPhone 14 Offer: ఆహా ఆఫర్ అంటే ఇదే.. ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఎక్కువ టైమ్ ఉండదు!

iPhone 14 Offer

iPhone 14 Offer

iPhone 14 Offer: పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కామర్స్ వెబ్‌సైట్ల మధ్య భారీ పోటీ నెలకొంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు కొత్త సేల్స్‌తో సరికొత్త ఆఫర్లను తీసుకొస్తున్నాయి. ఐఫోన్లపై కస్టమర్లకు మంచి తగ్గింపులు అందిస్తున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మీరు ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది మీకు గొప్ప అవకాశం.  ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఎయిర్ కండీషనర్‌లతో పాటు ఇతర గాడ్జెట్‌లు, గృహోపకరణాలపై ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లపై భారీ తగ్గింపులు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్  Phone 14 512GB వేరియంట్‌పై వినియోగదారులకు భారీ తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. ఇప్పుడు మీరు భారీ తగ్గింపుతో iPhone 14ని ఆర్డర్ చేయచ్చు.

ఐఫోన్ 14 బేస్ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్ ప్రకటించింది.  ఈ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. 512GB వేరియంట్ మోడల్ ధర ప్రస్తుతం రూ. 89,900గా ఉంది. ప్రస్తుతం మీరు దీని కంట చలా త్కువ ధరకే ఈ ఫోన్‌ను కొనచ్చు. దీపావళికి ముందు ఫ్లిప్‌కార్ట్ దాని ధరను కట్ చేసింది. కస్టమర్లకు 25 శాతం తగ్గింపును పొందొచ్చు. అంటే మీరు ఈ ప్రీమియం ఫోన్‌ను కేవలం రూ.66,999కి దక్కించుకోవచ్చు.

ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై కూడా బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తోంది. 5 శాతం క్యాష్‌బ్యాక్ కోసం మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించాలి. ఇది కాకుండా మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

అలానే దీనిపై మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల బెనిఫిట్స్ కూడా పొందచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చడం ద్వారా రూ.40 వేలకు పైగా ఆదా చేసుకోవచ్చు. అయితే మీరు పొందే ఎక్స్ఛేంజ్ వాల్యూ మొత్తం మీ ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

iPhone 14 Specifications
ఐఫోన్ 14లో మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే మెరుగైన ఫీచర్లను చూడవచ్చు. ఇందులో మీకు అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది.  ప్యానెల్‌లో గ్లాస్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది కాబట్టి మీరు దీన్ని నీటిలో కూడా ఉపయోగించచ్చు. ఇది సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటక్షన్‌తో 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఐఫోన్ 14లో Apple A15 బయోనిక్ చిప్‌సెట్ అందించారు. ఇందులో 6GB RAM + 512GB వరకు స్టోరేజ్ ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది. దీనిలో 12 + 12 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఇది కాకుండా సెల్ఫీ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. స్మార్ట్‌ఫోన్‌ రన్ చేయడానికి 3279mAh బ్యాటరీ ఉంది ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Exit mobile version