Site icon Prime9

Infinix Hot 40 5G Price Drop: ఇంకా చాలా ఉన్నాయ్.. 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్.. ఇంత తక్కువకు ఎలా?

Infinix Hot 40 5G

Infinix Hot 40 5G

Infinix Hot 40 5G Price Drop: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్ Hot 40 5Gపై భారీ ఆఫర్ ప్రకటించింది. దీని ధరను రూ.4750 తగ్గించింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరా, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌ను 19,999 రూపాయలకు విదుదల చేసింది. ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్న డీల్స్, డిస్కౌంట్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Infinix Hot 40 5G Offers
ఇన్ఫినిక్స్ ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ రూ. 4750 డిస్కౌంట్ అందిస్తోంది. దీని తర్వాత ఫోన్ ధర రూ. 15,249. ఈ ధరలో బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. Infinix Hot 40 5G ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15999కి అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా మీరు రూ.750 తగ్గింపు పొందుతారు. ఆ తర్వాత ఈ ఫోన్ ధర రూ.15,249కి తగ్గుతుంది.

Infinix Hot 40 5G Features
ఈ Infinix ఫోన్ 6.78-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,300 nits పీక్ బ్రైట్నస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ MediaTek Dimension 7020 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్‌లో 8GB RAM + 256GB వరకు స్టోరేజ్ ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Infinix తన XOS 14 స్కిన్‌పై ఫోన్ రన్ అవుతుంది. ఈ డివైజ్‌తో 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను కంపెనీ అందిస్తోంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, JBL డ్యూయల్ స్టీరియో సెటప్, IP53 రేటింగ్‌తో వస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40 ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OISతో 108MP ప్రైమరీ షూటర్, రెండు 2MP మాక్రో, డెప్త్ షూటర్‌లు ఉంటాయి. మందు 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీనితో క్వాలిటీ సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌, 33W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Exit mobile version