Site icon Prime9

Best Mobile Offers: ఇదెక్కడ మాస్ డీల్ మావ.. ఐఫోన్, సామ్‌సంగ్, మరెన్నో ఫోన్లపై కుప్పులు కుప్పలుగా ఆఫర్లు!

Best Mobile Offers

Best Mobile Offers

Best Mobile Offers: ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ జరుగుతోంది. అయితే సేల్ ఈ రోజు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి గొప్ప స్మార్ట్‌ఫోన్లను చౌకగా కొనే అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సేల్‌లో ప్రిమియం స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరకే లభిస్తాయి. వీటిలో సామ్‌సంగ్ నుంచి గూగుల్, ఆపిల్ వంటి ఫోన్లు ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iPhone 15 Plus
గతేడాది విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ బలమైన బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేస్తోంది. ఫోన్‌లో ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్‌ ఉంటుంది. ఇది 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో పాటు12MP Truedepth సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. 64,999 ప్రభావవంతమైన ధరతో దీన్ని దక్కించుకోవచ్చు.

iPhone 15 Pro
ఆపిల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో అప్‌డేట్‌ చేసిన ఈ ఫోన్ 48MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. పర్పాెన్స్ కో ఆపిల్ A17 Pro చిప్‌సెట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రూ. 119,990 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. కానీ ఇప్పుడు సేల్‌లో రూ. 92,999 ధరతో కొనచ్చు.

Motorola Edge 50 Pro 5G
కర్వ్డ్ డిస్‌ప్లే, IP68 రేటింగ్‌తో వస్తున్నమోటరోలా స్మార్ట్‌ఫోన్‌ను 27,999 రూపాయల తగ్గింపు ధరతో సేల్‌లో కొనచ్చు. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో బలమైన డీల్‌ను అందిస్తున్న ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది, 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.

Samsung Galaxy S24 Plus
ఈ ఫోన్‌లో Snapdragon 8 Gen 3 ప్రాసెసర్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీని 4900mAh కెపాసిటీ బ్యాటరీ 45W ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తోంది. అనేక AI ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఆఫర్లపై ఈ ఫోన్‌ ధర రూ.66,999.

Samsung Galaxy S24 Ultra
సామ్‌సంట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ Galaxy AI ఫీచర్లు, 200MP కెమెరా సెటప్‌తో వస్తుంది. మెటల్ బిల్డ్, ఎస్-పెన్ సపోర్ట్ అందించే ఈ ఫోన్‌ను రూ.109,999కి కొనుగోలు చేసే అవకాశం ఉంది. లాంచ్ సమయంలో దీని అసలు ధర రూ. 144,990.

Vivo V40 Pro
శక్తివంతమైన కెమెరా,  5500mAh బ్యాటరీతో వస్తున్న ఈ స్టైలిష్ ఫోన్‌లో కస్టమర్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌ చూస్తారు. ఫోన్‌ను సేల్‌లో రూ. 54,999కి బదులుగా రూ.46,999 ప్రభావవంతమైన ధరతో ఆర్డర్ చేయవచ్చు. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ ఫినిషింగ్ కలిగి ఉంది.

Oppo Reno 12 Pro 5G
ఒప్పో ఈ స్టైలిష్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా, 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది భారీ తగ్గింపుతో సేల్‌లో లభిస్తుంది.  రూ. 33,300 ప్రభావవంతమైన ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7300E ప్రాసెసర్ ఉంది.

Google Pixel 9 Pro XL
స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం, ఉత్తమ కెమెరా కోసం Google  అత్యంత శక్తివంతమైన ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇది రూ. 24 వేల తగ్గింపును పొందుతోంది. సేల్‌లో కస్టమర్లు 42MP ఫ్రంట్ కెమెరాతో ఫోన్‌ను రూ.100,999కి ఆర్డర్ చేయవచ్చు.

Xiaomi 14 Ultra
షియోమీ ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సేల్ సమయంలో సుమారు రూ. 30 వేల తగ్గింపును పొందుతోంది. దీనిని రూ. 89,999 ప్రభావవంతమైన ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 32MP ఫ్రంట్ కెమెరాతో పాటు వెనుక ప్యానెల్‌లో 50MP+50MP+50MP+50MP క్వాడ్ కెమెరా సెటప్ ఉంది.

Exit mobile version