Vivo T3x 5G: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో మొబైల్ ఫోన్‌లపై గణనీయమైన ఆఫర్‌లను ప్రకటించింది. కొత్త మొబైల్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్‌లను పొందినట్లయితే మరిన్నే తగ్గింపులను పొందవచ్చు. Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు వెబ్‌సైట్‌లో ఆకర్షణీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ Vivo T3x 5Gపై 25 శాతం తగ్గింపు అందిస్తోంది.
ఈ ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.12,999కి కొనుగోలు చేయవచ్చు. అదనంగా మీరు ఎంచుకున్న బ్యాంకుల నుండి చెల్లింపు చేస్తే ఆ మరిన్ని తగ్గింపులను పొందుతారు. Vivo T3x 5G మొబైల్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్ ప్రాసెసర్‌లో పని చేస్తుంది. ఇది 6000 mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ 4GB + 128GB, 6GB + 128GB, 8GB + 128GB వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్‌లోని ఇతర ఫీచర్లను ఒకసారి చూద్దాం.
Vivo T3x 5G Features
Vivo T3x 5G మొబైల్ 6.72 అంగుళాల డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది 1000 nits HBM బ్రైట్‌నెస్ ఆప్షన్, 339 ppi పిక్సెల్ డెన్సిటీ, 83 శాతం NTSC కలర్ గామట్‌తో ఫుల్ HD+ 2408-1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో ఉంటుంది. మొబైల్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్ ప్రాసెసర్‌లో రన్ అవుతుంది. ఇది Adreno 710 GPU ద్వారా కూడా సపోర్ట్ ఇస్తుంది. అలానే ఈ ఫోన్ Android 14 ఆధారంగా Funtouch OS 14లో రన్ అవుతుంది. ఫోన్ 4GB + 128GB, 6GB + 128GB, 8GB + 128GB వేరియంట్లలో అందుబాటులో ఉంది.
Vivo T3x 5G మొబైల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్. అలానే సెకండరీ కెమెరాలో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 199 గ్రాములు, 165.70 – 76.0 – 7.99mm నిష్పత్తిని కలిగి ఉంది. ఇది 44W ఫ్లాష్ ఛార్జ్‌కు సపోర్ట్ ఇచ్చే 6000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.