Site icon Prime9

Price Drop Alert: ధరలు పడిపోయాయి.. సీఎంఎఫ్, నథింగ్ ఫోన్లపై రూ.6 వేల డిస్కౌంట్.. ఇప్పుడు ఎంతంటే..?

Price Drop Alert

Price Drop Alert

Price Drop Alert: సీఎంఎఫ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2a రెండు ఫోన్‌లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో భారీ డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వేల రూపాయల తగ్గింపుతో వీటిని కొనుగోలు చేయచ్చు. ఆఫర్ తర్వాత, నథింగ్ ఫోన్ 2 దాని లాంచ్ ధర కంటే రూ. 6000 తక్కువకు అందుబాటులో ఉంది. సీఎమ్ఎఫ్ ఫోన్ 1 లాంచ్ ధర కంటే రూ. 3500 తక్కువకు లభిస్తుంది. ఈ రెండు ఫోన్ల ధర ఎంత ఉందో ఇప్పుడు చూడండి.

 

CMF Phone 1
ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,499 ధరకు లభిస్తుంది. ఈ ధరకే ఫోన్ 6GB+128GB వేరియంట్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం, ఈ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999 ధరకు జాబితా చేశారు. అంటే బ్యాంక్ ఆఫర్‌లో ఈ ఫోన్ రూ.3,500 తక్కువ ధరకు లభిస్తుంది. ఫోన్ 6GB + 128GB వేరియంట్‌పై కూడా అదే తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,999 ధరకు జాబితా చేశారు. కానీ బ్యాంక్ ఆఫర్ తర్వాత దీనిని రూ.14,499 ప్రభావవంతమైన ధరకు కొనుగోలు చేయవచ్చు.

 

Nothing Phone 2a
ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,999 ధరకు లభిస్తుంది. లాంచ్ సమయంలో, ఫోన్ బేస్ 8GB + 128GB వేరియంట్ ధర రూ.23,999. అంటే ఈ ఫోన్ దాని లాంచ్ ధర కంటే రూ.6,000 తక్కువకు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఫోన్ ధరను కూడా తగ్గించచ్చు.

 

CMF Phone 1 Features
ఈ 5G ఫోన్ 6.7 అంగుళాల అమోలెడ్ LTPS డిస్‌ప్లేతో విడుదలైంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, ఇది 8GB వరకు ర్యామ్‌తో వస్తుంది. అలానే ర్యామ్ బూస్టర్ ఫీచర్‌తో, ఫోన్ 16జీబీ వరకు ర్యామ్ పొందుతుంది. ఈ ఫోన్‌లో 256జీబీ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంది, దీనిని 2టీబీ వరకు విస్తరించవచ్చు. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్‌ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. పవర్ కోసం 5000mAh బ్యాటరీని అందించారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

 

Nothing Phoone 2a Features
ఈ 5G ఫోన్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది, ఇది వినియోగదారులు వెనుక లైట్లను వ్యక్తిగతీకరించడానికి అనుమతిస్తుంది. దీనికి 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు 12GB వరకు RAM తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో రెండు 50-మెగాపిక్సెల్ కెమెరాలతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం, ఫోన్ 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

Exit mobile version
Skip to toolbar