Site icon Prime9

Bobble AI: మహిళలు ఎక్కువగా వాడుతున్న యాప్స్ ఏంటో తెలుసా?

Bobble AI

Bobble AI: బొబ్బల్ ఏఐ అనే కీబోర్డ్ కంపెనీ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియెగదారులు ఫోన్ తో గడిపే టైమ్ విపరీతంగా పెరిగిందని సర్వేలో తేలింది. గత ఏడాదితో పోలిస్తే .. ఈ సంవత్సరం అది 50 శాతం పెరిగింది. ఈ సర్వే కోసం 85 మిలియన్ ఆండ్రాయిడ్ ఫోన్ల డేటాను పరిగణలోకి తీసుకున్నారు. దేశంలో స్మార్ట్ ఫోన్ల యూజర్లలో మగవారు అధిక సంఖ్యలో ఉన్నట్లు నివేదిక తేల్చింది. అదే విధంగా ఎక్కువ మంది మగవారు గేమింగ్ యాప్స్ ఇష్టపడుతుండగా.. ఫుడ్ , మెసేజింగ్ యాప్ లను ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు వెల్లడైంది.

 

స్మార్ట్ ఫోన్ల యూజర్స్ లో మగవారే ఎక్కువ(Bobble AI)

ఓవరాల్ యూజర్లలో డిజిటల్ పేమెంట్ యాప్స్ ను కేవలం 11.3 శాతం మంది మహిళలు మాత్రమే వినియోగిస్తున్నాట. గేమింగ్ యాప్ లపై 6.1 శాతం మంది ఇంట్రస్ట్ చూపుతున్నారు. అయితే, ఈ విషయంలో మగవారు ముందు వరుసులో ఉన్నట్టు సర్వే పేర్కొంది. మహిళల్లో 23.3 శాతం కమ్యూనికేషన్ యాప్స్ ను వినియోగిస్తుండగా.. 21.7 శాతం మంది వీడియో యాప్స్, ఫుడ్ కు సంబంధించిన యాప్స్ ను 23.5 శాతం మంది ఉపయోగిస్తున్నారు. 2022, 2023 లో సేకరించిన డేటా ఆధారంగా ఈ సర్వే నిర్వహించినట్టు బొబ్బల్ ఏఐ తెలిపింది. అదే విధంగా యూజర్స్ కు సంబంధించిన వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నివేధిక రూపొందించినట్టు పేర్కొంది.

 

Exit mobile version
Skip to toolbar