iPhone SE 4 Launch Date: ఆపిల్ iPhone SE 4ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ బడ్జెట్-సెంట్రిక్ iPhone వినియోగదారులకు గేమ్-ఛేంజర్‌గా నిరూపిస్తుంది. ఐఫోన్ 14-ప్రేరేపిత కొత్త డిజైన్, పెద్ద OLED డిస్‌ప్లే, శక్తివంతమైన హార్డ్‌వేర్ దీన్ని ఇంకా అత్యంత ఆకర్షణీయమైన ఎంట్రీ-లెవల్ ఐఫోన్‌గా మార్చగలవు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. iPhone SE 4 ఏప్రిల్‌లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అవుతుంది, అయితే ఈ ఫోన్ మార్చిలో లాంచ్ అవుతుందని నివేదికలు పేర్కొన్నాయి. ఐఫోన్ SE 4 అంచనా ధర, స్పెసిఫికేషన్‌లు, కెమెరా అప్‌గ్రేడ్ వివరాలను తెలుసుకుందాం.
iPhone SE 4 Launch Date
ఆపిల్ iPhone SE 4ని ఏప్రిల్ 2025 మధ్యలో లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 15 నాటికి మార్కెట్లోకి రావచ్చు. అయితే మునుపటి నివేదికలు ఈ ఫోన్‌ను ఆపిల్ మార్చిలో లాంచ్ చేయచ్చు. కంపెనీ ఐఫోన్ SE 3ని కూడా మార్చి 18, 2022న విడుదల చేసింది.
iPhone SE 4 Price
లీక్‌ల ప్రకారం.. USలో iPhone SE 4 ధర $499 (సుమారు రూ. 42,700) ఉండవచ్చు. అయితే, భారతదేశంలో దిగుమతి సుంకాలు, పన్నుల కారణంగా దీని ధర దాదాపు రూ.49,900కి చేరుకోవచ్చు. దుబాయ్‌లో దీని ధర దాదాపు AED 1,800 ఉండవచ్చని అంచనా. iPhone SE 4 ఈ ధరల శ్రేణితో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ అవుతుంది.
iPhone SE 4 Specifications
iPhone SE 4లో డిజైన్ పరంగా పెద్ద మార్పు రానుంది. ఈ బడ్జెట్ ఫోన్ ఐఫోన్ 14 లాగా ఉండవచ్చు. ఫోన్‌లో 6.06-అంగుళాల OLED డిస్‌ప్లే, ఫ్లాట్-ఎడ్జ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఈ డిస్‌ప్లే SE 4.7-అంగుళాల LCD డిస్ప్లే నుండి పెద్ద అప్‌గ్రేడ్.
అంతేకాకుండా, iPhone SE 4లో టచ్ IDని తొలగించి, Face IDతో కూడిన నాచ్ డిజైన్‌ను ఇవ్వచ్చు. ఇది హై-ఎండ్ ఐఫోన్‌ల వలె కనిపిస్తుంది. ఈ డిజైన్ మార్పు iPhone SE 4ని మరింత ఆకర్షణీయంగా, శక్తివంతమైనదిగా చేస్తుంది. అలానే పర్ఫామెన్స్ పరంగా A18 చిప్‌సెట్‌ను ఇందులో చూడచ్చు.
ఇదే ప్రాసెసర్‌ని ఐఫోన్ 16 సిరీస్‌లో ఉపయోగించారు. స్టోరేజ్ గురించి మాట్లాడితే ఫోన్‌లో 8జీబీ ర్యామ్ ఉంటుంది. లీక్‌ను విశ్వసిస్తే ఐఫోన్ 16 మాదిరిగానే 48మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. కెమెరా 2x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ ఇస్తుంది. దీనితో పాటు ముందు భాగంలో 12MP TrueDepth కెమెరాను చేర్చవచ్చు.