Site icon Prime9

Samsung Galaxy S24 Discount Offers: ప్లాష్ ప్లాష్.. అమెజాన్‌లో భారీ ఆఫర్స్.. స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్స్..!

Samsung Galaxy S24 Discount Offers

Samsung Galaxy S24 Discount Offers

Samsung Galaxy S24 Discount Offers: సామ్‌సంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ ‘Samsung Galaxy S24’పై రూ. 24,499 కంటే ఎక్కువ బంపర్ తగ్గింపును అందిస్తోంది, దీనిని అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. ఇంత భారీ ధర తగ్గింపుతో సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్‌ను కొనుగోలు చేయడానికి ఇదే ఉత్తమ సమయం. అమెజాన్ తరచుగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై పెద్ద తగ్గింపులను అందిస్తుంది. ఇది లిమిటెడ్ డీల్ మాత్రమే. ఈ ప్రత్యేక డీల్ గురించి ఒకసారి చూద్దాం.

Samsung Galaxy S24 Discount Offer
సామ్‌సంగ్ గెలాక్సీ S24 భారతదేశంలో దాదాపు 80 వేల రూపాయలకు ప్రారంభించారు. అమెజాన్ ప్రస్తుతం ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను 55,500 రూపాయల తగ్గింపు ధరతో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో, మీరు ఫోన్‌పై అదనపు 5శాతం తగ్గింపును పొందచ్చు, ఈ డిస్కౌంట్ ఫోన్ ధరను మరింత తగ్గిస్తుంది. ఇది కాకుండా, మీరు మరింత ఆదా చేయడానికి మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకోవచ్చు.

కంపెనీ రూ. 27,350 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఇస్తుండగా, ఇది పూర్తిగా మీ పాత ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను వర్తింపజేసినప్పుడు, మీరు మీ పాత iPhone 11ని మార్పిడి చేసుకుంటే, మీరు రూ. 13,000 తగ్గింపును పొందచ్చు, దీని వలన ధర మరింత తగ్గుతుంది.

Samsung Galaxy S24 Features
సామ్‌సంగ్ గెలాక్సీ‌లో 6.2-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో Exynos 2400 ప్రాసెసర్‌ ఉంది. ఇది గరిష్టంగా 8జీబీ ర్యమ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉంది. అలానే ఇందులో 4,000mAh బ్యాటరీని అందించారు. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Exit mobile version
Skip to toolbar