Site icon Prime9

OnePlus Nord 4 5G‌: అమెజాన్ సేల్.. వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై రూ.5 వేల డిస్కౌంట్.. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, AI ఫీచర్లు!

OnePlus Nord 4 5G‌

OnePlus Nord 4 5G‌

OnePlus Nord 4 5G‌: ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్ అవుతుంది. సేల్‌లో OnePlus Nord 4 5G‌  ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో మెటల్ బిల్డ్‌తో కూడిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఇది.  స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక కూపన్లు, బ్యాంక్ డిస్కౌంట్లు అందిస్తోంది. ఫోన్ ప్రత్యేకమైన AI ఫీచర్లను కలిగి ఉంది. ఈ క్రమంలో దీని ఫీచర్లు, ధర తదితర వివరాల గురించి తెలుసుకుందాం.

వన్‌ప్లస్ నార్డ్‌4 5జీ ప్రత్యేకత ఏమిటంటే దాని బిల్డ్ క్వాలిటీ మాత్రమే కాకుండా ప్రీమియం సాఫ్ట్‌వేర్ ఫీల్ అందిస్తోంది. ఆరేళ్లపాటు నాలుగు మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇది కాకుండా బ్యాటరీ హెల్త్ ఇంజిన్‌తో వినియోగదారులు నాలుగు సంవత్సరాల పాటు గరిష్ట బ్యాటరీ సామర్థ్యాన్ని పొందుతారు. మెటల్ యూనిబాడీ డిజైన్‌తో కూడిన OnePlus ఫోన్‌లు 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తాయి.

ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో నార్డ్‌ఫోర్‌4 5G  8GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్‌పై అతిపెద్ద తగ్గింపు అందుబాటులో ఉంది. దీనిపై రూ. 3000 కూపన్ తగ్గింపు ఇస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ. 2000 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ విధంగా మొత్తం 5000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఫోన్‌ను 27,998 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. మిగిలిన రెండు వేరియంట్‌లపై కూడా సేల్ సమయంలో రూ. 4000 తగ్గింపు లభిస్తుంది.

కస్టమర్‌లు తమ పాత ఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసేటప్పుడు గరిష్టంగా రూ.29,900 ఎక్స్చేంజ్ తగ్గింపును పొందవచ్చు. దీని విలువ పాత ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ ఒయాసిస్ గ్రీన్, అబ్సిడియన్ మిడ్‌నైట్, మెర్క్యురియల్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

OnePlus Nord 4 5G Specifications
OnePlus స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 2150నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో 6.74-అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్‌‌పై రన్ అవుతుంది. ఫోన్ IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 14.1 సాఫ్ట్‌వేర్ స్కిన్‌ను కలిగి ఉంది.

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే వెనుక ప్యానెల్‌లో 50MP ప్రైమరీ, 8MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అనేక AI ఆధారిత కెమెరా ఎడిటింగ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదిఅతిపెద్ద 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.

Exit mobile version