Site icon Prime9

Samsung Galaxy S24 5G: అమెజాన్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్..!

Samsung Galaxy S24 5G

Samsung Galaxy S24 5G

Samsung Galaxy S24 5G: దక్షిణ కొరియా టెక్ కంపెనీ సామ్‌సంగ్ పెద్ద మార్కెట్ వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టాప్ లిస్ట్‌లో ఉంది.  దాని ఫ్లాగ్‌షిప్ ఫోన్లు కెమెరా నుండి డిస్‌ప్లే వరకు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్సల్ సేల్ సందర్భంగా కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ Galaxy S24 5Gపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌‌ఫోన్ లాంచ్ ధర కంటే రూ.25,000 చౌకగా అందుబాటులో ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ 5జీ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తుంది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ ఉంది.  ఇది పెద్ద 6.2 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందిస్తుంది. విశేషమేమిటంటే ఆండ్రాయిడ్ 14తో వస్తున్న ఈ డివైజ్ వచ్చే ఏడేళ్లపాటు మేజర్ అప్‌డేట్‌లను పొందుతూనే ఉంటుంది.

Samsung Galaxy S24 5G Offers
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కారణంగా Samsung Galaxy S24 5G  వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్‌తో అమెజాన్‌లో రూ. 55,700 ధరతో అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఎంపిక చేసి బ్యాంక్ కార్డుల ద్వారా పేమెంట్ చేస్తే రూ. 1000 వరకు ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. ఈ వేరియంట్‌ను రూ.79,999 ధరతో లాంచ్ చేశారు. అంటే లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు రూ.25 వేలు తక్కువకు కొనచ్చు.

కస్టమర్లు తమ పాత ఫోన్‌ని మార్చుకోవాలనుకుంటే  గరిష్టంగా రూ. 48,850 వరకు తగ్గింపు పొందవచ్చు. దీని విలువ పాత ఫోన్ మోడల్, స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఫోన్ నిక్స్ బ్లాక్, మార్బుల్ గ్రే, కోబాల్ట్ వైలెట్, అంబర్ ఎల్లో వంటి కలర్స్‌లో అందుబాటులో ఉంది.

Samsung Galaxy S24 5G Specifications
సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, 2600nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.2 అంగుళాల డైనమిక్ LTPO AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్ పొందుతుంది.  IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ,స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఆధారంగా OneUI సాఫ్ట్‌వేర్ స్కిన్‌‌పై రన్ అవుతుంది.

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే గెలాక్సీ S24 5G వెనుక ప్యానెల్‌లో 50MP ప్రైమరీ, 10MP టెలిఫోటో, 12MP అల్ట్రా వైడ్ సెన్సార్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. దీని 4000mAh బ్యాటరీ 25W వైర్డు, 15W వైర్‌లెస్, 4.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ పొందుతుంది.

Exit mobile version