Amazon Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్స్ మొబైల్ ప్రియులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వరుస ఆఫర్లతో అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్ ఐటెల్ డేస్ సేల్ ప్రకటించింది. సేల్ రూ.10 వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు. మీరు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన itel S24ను భారీ తగ్గింపుతో దక్కించుకోవచ్చు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర రూ.8,499. జనవరి 2 వరకు జరిగే ఈ సేల్‌లో రూ. 500 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సేల్‌లో ఈ ఫోన్‌పై బలమైన క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తున్నారు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో అదనపు తగ్గింపుతో ఈ ఫోన్‌ను కూడా కొనుగోలు చేవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్ స్థితి, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
itel S24 Specifications
కంపెనీ ఈ ఫోన్‌లో 720×1612 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ HD + డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ 8 GB RAM +128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. విశేషమేమిటంటే కంపెనీ ఫోన్‌లో మెమరీ ఫ్యూజన్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది, దీని కారణంగా దాని మొత్తం RAM 16 GB కి చేరుకుంటుంది. ప్రాసెసర్‌గా మీరు ఫోన్‌లో MediaTek Helio G91 చిప్‌సెట్‌ని చూడవచ్చు. ఫోన్ ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో వెనుక భాగంలో రెండు కెమెరాలను కలిగి ఉంది.
వీటిలో 108-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో కూడిన QVGA డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం మీరు ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను చూడచ్చు. ఫోన్‌ను పవర్ చేయడానికి ఇది 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS విషయానికి వస్తే ఫోన్ Android 13 ఆధారంగా itel OS 13లో పనిచేస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం, కంపెనీ ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తోంది.