Site icon Prime9

Samsung Mobile Offer: వదలొద్దు.. రూ.6,499కే సామ్‌సంగ్ ఫోన్.. ఆఫర్ అయిపోతుంది..!

Samsung Galaxy M05

Samsung Galaxy M05

Samsung Mobile Offer: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సామ్‌సంగ్ ఇప్పుడు తన సరసమైన 4G మొబైల్ ఫోన్ Samsung Galaxy M05 ధరను తగ్గించింది. కంపెనీ ఈ Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7,999 వద్ద విడుదల చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరను రూ. 1500 తగ్గించింది. ఆ తర్వాత Samsung Galaxy M05ని కేవలం రూ.6,499కే కొనుగోలు చేయవచ్చు. కాబట్టి ఎక్కువ సమయం వృధా చేయకుండా Samsung Galaxy M05ని చౌకగా ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.

సామ్‌సంగ్ గెలాక్సీ M05 ప్రారంభ ధర రూ. 7,999. ఇప్పుడు ఈ ఫోన్ ధర 1500 రూపాయలు తగ్గింది. ఆ తర్వాత Samsung Galaxy M05 ఫోన్‌ని రూ.6,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ ధరతో మీరు ఫోన్ 4GB RAM+64GB స్టోరేజ్ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ధరతో మీరు ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ నుండి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు. అలానే ఈ ఫోన్ పై మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

అలాగే మీరు ఈ ఫోన్‌లో అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి, మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 6,150 వరకు తగ్గింపును పొందచ్చు. అయితే ఈ డీల్ ధర మీ పాత ఫోన్ పర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ సరికొత్త Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్‌ను Amazon ద్వారా కేవలం రూ. 6,499కి ఆర్డర్ చేయచ్చు.

Samsung Galaxy M05 Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ వాటర్‌డ్రాప్ నాచ్ స్టైల్ PLC LCD ప్యానెల్‌పై వస్తుంది. ఇది 16 మిలియన్ల కలర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఈ మొబైల్ వేగం, మల్టీ టాస్కింగ్ కోసం MediaTek Helio G85 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ని పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్‌తో పాటు 4GB వర్చువల్ RAM టెక్నాలజీతో కూడా వస్తుంది. అలానే ఈ ఫోన్ 64GB స్టోరేజీని సపోర్ట్ చేస్తుంది. ఇది మెమరీ కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.

ఇది డ్యూయల్ రియర్ కెమెరాలను సపోర్ట్ చేస్తుంది. దీని వెనుక ప్యానెల్ 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు LED ఫ్లాష్‌తో 50MP మెయిన్ సెన్సార్‌ను కలిగి ఉంది.  అద్భుతమైన సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్ పవర్ బ్యాకప్ కోసం 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి మొబైల్‌లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు.

Exit mobile version