Site icon Prime9

Poco M6 Plus 5G: శివరాత్రి స్పెషల్.. పోకో ఆఫర్ల జాతర.. రూ.11,249లకే 5జీ ఫోన్..!

Poco M6 Plus 5G

Poco M6 Plus 5G: మహా శివరాత్రి సందర్భంగా పోకో తన కస్టమర్లకు చక్కటి బహుమతిని అందిస్తోంది. మీరు చౌకైన 5G ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ అవకాశాన్ని అసలు మిస్ చేయకండి. అమెజాన్‌లో ‘Poco M6 Plus 5G’ ఫోన్‌పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. ఈ పోకో ఫోన్ బేస్ ధర, ఆఫర్స్, స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.

Poco M6 Plus 5G Highlights
పోకో ఎమ్6 ప్లస్ 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ వేరియంట్‌పై డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌లో 108- మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 AE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్‌లో 6.79 అంగుళాల డిస్‌ప్లే ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్, 5030mAh బ్యాటరీ,33W ఫాస్ట్ ఛార్జర్‌ కూడా ప్యాక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ 5జీ ఫోన్ కేవలం రూ.11,249లకే విక్రయిస్తోంది.

Poco M6 Plus 5G Offers
పోకో M6 ప్లస్ 5జీ మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది. ఫోన్ 6GB RAM వేరియంట్ ధర రూ.13,499గా ఉంది. 8GB RAM మోడల్‌ను రూ.14,499కే పరిచయం చేశారు. 8GB RAM మోడల్ ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం 11,999 రూపాయలకే విక్రయిస్తున్నారు.ఈ ఆఫర్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే 750 అదనపు తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌తో, ఈ 8GB RAM 5G ఫోన్‌ను కేవలం రూ.11,249లకి కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ICICI, SBI క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై అందుబాటులో ఉంది.

Poco M6 Plus 5G Features And Specifications
పోకో M6 ప్లస్ 5జీ‌లో 6.79-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది ఫుల్ HD ప్లస్ LCD స్క్రీన్. డిస్‌ప్లే 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, పీక్ బ్రైట్నెస్ 550 నిట్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ ఉంది.

మొబైల్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 AE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్ OS పై రన్ అవుతుంది. గ్రాఫిక్స్ కోసం ఇందులో Adreno A613 GPU కూడా ఉంది. పోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. 6GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 3x ఇన్-సెన్సార్ జూమ్ టెక్నాలజీతో 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ మొబైల్ 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో 5030mAh కెపాసిటీ బ్యాటరీని ఉంది. ఈ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే.. ఇందులో బ్లూటూత్ 5, Wi-Fi 6, 5G, డ్యూయల్ 4G VoLTE, GPS, USB టైప్-C మొదలైనవి ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar