Site icon Prime9

iPhone Price Drop: ధర పడిపోయింది.. ఐఫోన్‌పై రూ.10 వేల డిస్కౌంట్.. ఇదే మంచి సమయం..!

iPhone Price Drop

iPhone 16 Pro Price Drop: మొబైల్ లవర్స్‌కు అమెజాన్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఐఫోన్ 16 ప్రో ధరను భారీగా తగ్గించేసింది. ఇప్పుడు పెద్ద డిస్కౌంట్‌లతో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 1,12,900కి లాంచ్ చేసింది. అయితే కార్డ్ ఆఫర్‌తో దీని ధర కేవలం రూ. 1,09,900కి తగ్గుతుంది. అలానే ఇక్కడ మీకు రూ. 10,400 ఫ్లాట్ తగ్గింపు కూడా లభిస్తుంది. ఫోన్ ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

iPhone 16 Pro Offers
దేశంలో ఐఫోన్ 16 ప్రోని రూ. 1,19,900కి లాంచ్ చేసింది. అయితే ఇప్పడు ఆఫర్స్‌పై రూ. 1,09,500కి అందుబాటులో ఉంది. అలానే మీకు రూ. 10,400 ఫ్లాట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా ICICI బ్యాంక్, SBI బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 3,000 తగ్గింపు లభిస్తుంది. OneCard క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 4,000 అదనపు తగ్గింపును పొందచ్చు, HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లు రూ. 4,500 తగ్గింపు ఇస్తున్నారు. దీంతో ఫోన్ చివరి ధర రూ.1,05,000గా ఉంది.

iPhone 16 Pro Specifications
ఐఫోన్ 16 ప్రోలోపెద్ద 6.3-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్‌లో సన్నని బెజెల్‌లు కనిపిస్తాయి, ఇది మరింత ప్రీమియం చేస్తుంది. డిస్‌ప్లే 120Hz ప్రమోషన్‌ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ లో లైటింగ్‌లో మంచి బ్రైట్నెస్‌ను అందిస్తుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ ఉంటుంది. A18 ప్రో 6-కోర్ GPU దాని మునుపటి A17 ప్రో కంటే 20 శాతం వేగంగా ఉందని యాపిల్ పేర్కొంది.

ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ ప్రోరా, HEIF ఫోటోలలో షట్టర్ లాగ్‌ను తొలగించే రెండవ తరం క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో కొత్త 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. కెమెరాలు 120fps వద్ద 4K వీడియో క్యాప్చర్‌ని సపోర్ట్ చేస్తాయి. అల్ట్రా-వైడ్ కెమెరా ఆటోఫోకస్‌తో 48-మెగాపిక్సెల్‌కు అప్‌గ్రేడ్ చేస్తుంది. మూడవ సెన్సార్ 5x ఆప్టికల్ జూమ్, 120 మిమీ ఫోకల్ లెంగ్త్‌తో కూడిన 12-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar