Amazon Mobile Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు ‘Samsung Galaxy M15 5G Prime Edition’ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. మొబైల్‌పై 24 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. ముఖ్యంగా 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, డైమెన్సిటీ చిప్‌సెట్ సహా పలు ప్రత్యేక ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్‌కు సంబంధించిన ఆఫర్లు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy M15 5G Prime Edition Discounts
అమెజాన్ సామ్‌సంగ్ గెలాక్సీ M15 5జీ ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. మొబైల్ ధరపై 24 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. ఈ తగ్గింపు తర్వాత రూ. 12,999 ధరతో కొనుగోలు చేయచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్ రూ.389 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో కూడా వస్తుంది. కాబట్టి మీరు ఈ ఫోన్‌ను తక్కువ ధరకే పొందచ్చు.
Samsung Galaxy M15 5G Prime Edition Features
సామ్‌సంగ్ గెలాక్సీ M15 5జీ ప్రైమ్ ఎడిషన్‌లో 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే 1080 x 2340 పిక్సెల్‌లు, 90Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కి సపోర్ట్ చేస్తుంది. 19.5:9 యాస్పెక్ట్ రేషియో కూడా ఉన్నాయి.ఈ ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 6nm చిప్‌సెట్‌తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్‌లో ఆర్మ్ మాలి G57 MC2 GPU గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. కాబట్టి గేమింగ్ యూజర్లు ఈ ఫోన్‌ను నమ్మకంగా కొనుగోలు చేయవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లో 50 MP ప్రైమరీ కెమెరా + 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ + 2 MP మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ వెనుక కెమెరాలు ఆటో ఫోకస్ సపోర్ట్, 10x డిజిటల్ జూమ్, ఫుల్ హెచ్‌డి వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ స్మార్ట్‌ఫోన్ సహాయంతో అద్భుతమైన చిత్రాలను తీయవచ్చు.
స్టోరేజ్ విషయానికి వస్తే 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. అదనపు స్టోరేజ్ కోసం ఈ ఫోన్ మెమరీని పెంచుకోవచ్చు. అంటే మీరు మెమరీ కార్డ్‌ని ఉపయోగించడానికి ఈ ఫోన్ మైక్రో SD కార్డ్ స్లాట్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీతో వచ్చింది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఫోన్‌లో 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11, బ్లూటూత్ 5.3, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి పోర్ట్ సహా వివిధ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.