Site icon Prime9

Best Charging Phones: ఈ మూడే తోపు.. బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్లపై భారీ ఆఫర్లు..!

6000 mah battery phones

6000 mah battery phones

Best Charging Phones: మీ ఫోన్‌లో బ్యాటరీ పదే పదే డ్రెయిన్ అవుతుందా? ఎప్పుడు ఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచడానికి విసిగిపోతున్నారా? అయితే మీరు వెంటనే జంబో బ్యాటరీ ఉన్న ఫోన్ కొనాలి. 6000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఫోన్లు మీకు సరిగ్గా సరిపోతాయి. ఈ క్రమంలో ఇటువంటి ఫోన్లను కొనాలని ప్లాన్ చేస్తుంటే అమెజాన్ సేల్‌లో మీ కోసం అనేక గోల్డెన్ డీల్స్ ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

iQOO Z9x 5G
ఈ ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 12499కి కొనచ్చు. ఈ ఫోన్‌పై 500 రూపాయల డిస్కౌంట్ కూపన్ ఆఫర్ చేస్తోంది. ఇది కాకుండా మీరు బ్యాంక్ కార్డ్ ద్వారా ఫోన్‌పై రూ.1249 తగ్గింపును కూడా పొందుతారు. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఫోన్ 6.72 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 6 Gen 1 ప్రాసెసర్‌, 6000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Samsung Galaxy M35 5G
ఈ ఫోన్ 6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్‌ను అమెజాన్ నుండి రూ.14,999కి లభిస్తుంది. SBI బ్యాంక్ కార్డ్ ద్వారా ఈ ఫోన్‌ బుక్ చేస్తే మీకు రూ.1250 తగ్గింపు ఇస్తోంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఫోన్ 6.6 అంగుళాల డిస్‌ప్లే, Exynos 1380 ప్రాసెసర్‌ ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఫోన్ బ్యాటరీ 6000mAh. దీనితో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది.

Realme narzo 50A
ఈ ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌ను అమెజాన్ నుంచి రూ.9,790కి ఆర్డర్ చేయవచ్చు. బ్యాంక్ కార్డ్ ద్వారా ఫానోపై రూ.979 తగ్గింపు లభిస్తుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఫోన్ 6.5 అంగుళాల డిస్‌ప్లే, MediaTek Helio G85 ప్రాసెసర్‌ ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఫోన్ బ్యాటరీ 6000mAh, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Exit mobile version