Free Amazon Prime Video: భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీ ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుతం ఎంపిక చేసిన రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లపై ఉత్తమ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ సేవలను ఉచితంగా అందిస్తోంది. మీ ఎయిర్‌టెల్ కస్టమర్ అయితే.. మీ తదుపరి రీఛార్జ్‌లో అపరిమిత కాలింగ్, డేటాతో పాటు ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే కాంబో రీఛార్జ్ ప్లాన్ కావాలనుకుంటే.. ఈ జాబితాను గుర్తుంచుకోండి.
అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్‌లకు ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసేటప్పుడు అపరిమిత 5G డేటా ప్రయోజనం అందించనున్నారు. దీని కోసం వినియోగదారు తప్పనిసరిగా 5G ఫోన్‌ని కలిగి ఉండాలి. కంపెనీ 5G సేవలు వారి ప్రాంతంలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. మీకు ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కావాలంటే, మీరు క్రింద పేర్కొన్న ప్లాన్‌లను ఎంచుకోవాలి.
Airtel Rs. 838 Plan
మీకు తక్కువ ధరలో ఎక్కువ డేటా కావాలంటే, ఈ ప్లాన్ మొత్తం 56 రోజుల పాటు 3GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ వ్యవధిలో అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రీఛార్జ్‌తో, వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ 56 రోజులు మాత్రమే అందించారు. అదనంగా Airtel X Steam Play ప్రీమియం యాక్సెస్ అందుబాటులో ఉంది. దీనితో ఒకరు 22 కంటే ఎక్కువ OTT సేవల నుండి కంటెంట్‌ను చూడచ్చు.
Airtel Rs.1199 Plan
ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో 2.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాల్‌లను కూడా చేయచ్చు. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పంపే అవకాశం కూడా కల్పిస్తోంది. Airtel X Stream Play Premium యాక్సెస్ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు పూర్తి 84 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఇది 22 కంటే ఎక్కువ OTT సేవల నుండి కంటెంట్‌ను చూసే అవకాశాన్ని అందిస్తుంది.