Site icon Prime9

Summer AC Deals: సమ్మర్ ఆగయా.. సగం ధరకే ఈ ఏసీలు.. నెవ్వర్ బిఫోర్ అంతే!

flipkart Ac offers

flipkart Ac offers

Flipkart Summer AC Deals: వేసవి కాలం ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరు ఏసీలు కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. ఏప్రిల్-మే, జూన్ నెలల్లో మండే వేడిని నివారించడానికి మీరు కూడా ఏసీని కొనాలని చూస్తుంటే మీకో శుభవార్త ఉంది. ఏసీకి డిమాండ్ పెరగడంతో 1.5 టాన్ స్ప్లిట్ ఏసీ ధరలు భారీగా తగ్గాయి. స్ప్లిట్ ఏసీ కొనడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఫ్లిప్‌కార్ట్ తన లక్షలాది మంది కస్టమర్లకు 1.5 టాన్ స్ప్లిట్ ఏసీపై గొప్ప ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ స్ప్లిట్ ఏసీల ధరను 52శాతం వరకు తగ్గించింది. మీరు ఇప్పుడే షాపింగ్ చేస్తే ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ,బంపర్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఎల్‌జీ, సామ్‌సంగ్, బ్లూ స్టార్, డైకిన్ వంటి బ్రాండెడ్ ఏసీలను భారీ డిస్కౌంట్లతో కొనుగోలు చేయచ్చు.

 

Samsung 1.5 Ton AC
ఇది సామ్‌సంగ్ నుండి 2025లో వచ్చిన కొత్త స్ప్లిట్ ఏసీ. ఈ ఎయిర్ కండిషనర్ 5 స్టెప్ కన్వర్టిబుల్ ఫీచర్‌తో వస్తుంది. సామ్‌సంగ్ స్ప్లిట్ ఏసీలో వైఫై ఫీచర్ కూడా అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 56990 కానీ కంపెనీ ప్రస్తుతం దానిపై 35శాతం తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 36,490 కి కొనుగోలు చేయవచ్చు. మీరు మీ పాత ఏసీని రూ. 5600 వరకు ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు.

 

Voltas 1.5 Ton AC
మీరు వోల్టాస్ అభిమాని అయితే, స్ప్లిట్ ఏసీ మోడల్ నంబర్ (183V CAX(4503692) పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ స్ప్లిట్ ఏసీ ధర రూ. 62,990. కంపెనీ దాని ధరను 46శాతం తగ్గించింది, ఆ తర్వాత ఇప్పుడు దీనిని కేవలం రూ. 33,990 కి కొనుగోలు చేయచ్చు. ఈ ఏసీలో కంపెనీ రూ. 5600 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.

 

LG 1.5 Ton AC
స్ప్లిట్ ఏసీల విషయానికి వస్తే ఎల్‌జీ ఒక ప్రసిద్ధ బ్రాండ్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ US-Q19YNZE1 మోడల్ నంబర్‌తో ఎల్‌ స్ప్లిట్ ACపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ AC ధర రూ. 85,990 కానీ మీరు దీన్ని 45శాతం తగ్గింపుతో కొనుగోలు చేసి కేవలం రూ. 46,490కే ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇందులో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు రూ.6600 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తోంది.

 

Realme 1.5 Ton AC
రియల్‌మీ స్ప్లిట్ ఏసీని చాలా సరసమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రియల్‌మీ 5 స్టార్ స్ప్లిట్ ఏసీపై పై భారీ తగ్గింపును అందిస్తోంది. రియల్‌మీ 1.5 టన్ 5 స్టార్ స్ప్లిట్ ఏసీ ధర రూ.66,999, కానీ మీరు దానిని 50శాతం తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు. ఈ స్ప్లిట్ ఏసీ ధర ప్రస్తుతం కేవలం రూ.32,990.

 

Voltas 1.5 Ton 3 Star AC
వోల్టాస్ నుండి వచ్చిన ఈ స్ప్లిట్ ఏసీ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.64,99గా ఉంది. మండే ఎండలు రాకముందే, కంపెనీ దాని ధరను 48శాతం తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఏసీని కేవలం రూ.33,490కి విక్రయిస్తోంది. 5600 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు దానిని మరింత తక్కువ ధరకు ఇంటికి తీసుకెళ్లవచ్చు.

 

LG 1.5 Ton 3 Star AC
ఎల్‌జీ తన త్రీ స్టార్ ఏసీ ధరలో భారీ కోత విధించింది. US-Q18JNXE మోడల్ నంబర్ కలిగిన స్ప్లిట్ ఏసీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.78,990గా ఉంది. అయితే, మీరు దానిని సగం కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై ఫ్లిప్‌కార్ట్ 52శాతం తగ్గింపును అందిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత, మీరు దీన్ని కేవలం రూ. 37,690 కి కొనుగోలు చేయచ్చు.

 

Whirlpool 1.5 Ton AC
వర్ల్‌పూల్ అనేది ఏసీ విభాగంలో సుప్రసిద్ధమైన పేరు. ఫ్లిప్‌కార్ట్ వర్ల్‌పూల్ స్ప్లిట్ ఏసీపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వర్ల్‌పూల్ 3 స్టార్ ఏసీ ధర ప్రస్తుతం వెబ్‌సైట్‌లో రూ. 64,600. కానీ, ఇప్పుడు కస్టమర్లకు దానిపై 45శాతం తగ్గింపు ఇస్తున్నారు. ఆఫర్ తో మీరు దీన్ని కేవలం రూ. 34,949కి కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version
Skip to toolbar