Site icon Prime9

Kho Kho World Cup: ఖోఖోలో సత్తా చాటిన భారత్.. దక్షిణాఫ్రికాపై విజయం

Women, Indian Men’s Team also clinch inaugural Kho Kho World Cup: ఢిల్లీలో జరుగుతున్న ఖోఖో ప్రపంచ కప్‌ తొలి ఎడిషన్‌లో మన దేశం అదిరిపోయే ప్రదర్శన చేసింది. గ్రామీణ క్రీడల్లో తమకు తిరుగులేదని నిరూపిస్తూ… ఈ మెగాటోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో జరిగిన పురుషుల సెమీస్‌లో భారత్‌ జట్టు 62-42తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో ఫైనల్లో నేపాల్‌తో భారత్‌ తలపడనుంది. మరోవైపు, మన అమ్మాయిల జట్టు 66-16తో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఆదినుంచి సెమీస్‌లో దూకుడును ప్రదర్శించిన అమ్మాయిలు.. తుది పోరులో నేపాల్‌ జట్లను ఢీకొట్టనున్నారు. దీంతో మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్‌లో ఆతిథ్య భారత జట్లు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచినట్లయింది.

Exit mobile version
Skip to toolbar