Virender Sehwag to divorce wife Aarti Ahlawat news viral: టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు, ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన భార్య ఆర్తి అహ్లావత్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరూ ఇన్ స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు గత కొంతకాలంగా విడిగా ఉంటున్నట్లు సమాచారం. కాగా, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్.. 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత దీపావళి రోజున ఒంటరిగా ఉన్న ఫోటోను వీరేంద్ర సెహ్వాగ్ షేర్ చేయడంతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు గుంపుమన్నాయి.