Prime9

Vaibhav-MS Dhoni: ధోనీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న 14ఏళ్ల వైభవ్.. వీడియో వైరల్

Vaibhav Suryavanshi touches MS Dhoni’s feet: ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. చెన్నై విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ అలవోకగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సురవంశీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వైభవ్ (33 బంతుల్లో 57, 4 ఫోర్లు, 4 సిక్స్‌లు). అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

 

మ్యాచ్ పూర్తయిన తర్వాత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వెళ్తుండగా.. ఆటగాళ్లు ఒకరికొకరు విషెస్ చేసుకుంటారు. ఈ సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రాగానే.. రాజస్థాన్ బ్యాటర్ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. వావ్.. సూపర్ అంటూ అతడిని పొగడ్తలతో ముంచేశాడు. ధోనీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడంతో కెమెరాలన్నీ అతడివైపే వెళ్లాయి. దీనికి సంబంధించిన వీడియోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.

 

ఇక, ధోనీ వయస్సుు 44 సంవత్సరాలు ఉండగా.. వైభవ్ సూర్యవంశీ వయస్సు కేవలం 14 ఏళ్లే. వీరిద్దరి మధ్య 30 ఏళ్లు గ్యాప్ ఉంది. ఇలా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఆశీర్వాదం తీసుకోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, మా మనసులు గెలిచావ్.. అని చెన్నై ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.

 

Exit mobile version
Skip to toolbar