Site icon Prime9

Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ ఊరకొట్టుడు.. మూడో టీ20లో శ్రీలంకపై భారత్ సూపర్ విక్టరీ

suryakumar yadav centuary leads super victory for india aginst srilanka in 3rd t20

suryakumar yadav centuary leads super victory for india aginst srilanka in 3rd t20

Suryakumar Yadav : రాజ్‌కోట్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. శ్రీలంకపై 91 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తో కైవసం చేసుకుంది. మొదటి టీ20లో ఇండియా విజయం సాధించగా.. రెండో మ్యాచ్ శ్రీలంక గెలిచింది. దీంతో చివరి మ్యాచ్‌ పై అందరికీ ఆసక్తి పెరిగింది. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 51 బంతుల్లో 112 పరుగులు చేసి సెంచరీతో చెలరేగడంతో భారత్‌ భారీ స్కోర్ చేసింది. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే ఆలౌటైంది.

ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే ఓట్ అయినప్పటికీ, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 46 పరుగులు చేశాడు. వాటిలో మూడు సిక్సులు, రెండు ఫోర్లు ఉన్నాయి. ఇక రాహుల్ త్రిపాఠి 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. నాలుగో స్థానంలో దిగిన సూర్యకుమార్ యాదవ్.. ఈ మ్యాచ్ లో ఊరకొట్టుడు కొట్టాడు. 51 బంతుల్లోనే 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వాటిలో 9 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. తనదైన క్లాస్ బ్యాటింగ్ తో లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు ఈ యంగ్ బ్యాట్స్ మెన్. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ చేసిన మూడో సెంచరీ ఇది.

ఆ విషయంలో సూర్యకుమార్ యాదవ్ రికార్డు…

అలానే ఈ ఏడాది తొలి టీ20 సెంచరీని సూర్యకుమార్‌ నమోదు చేశాడు. ఫాస్టెస్ట్ సెంచరీ పరంగా రోహిత్ శర్మ (35 బంతుల్లో) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. అలానే మిగిలిన భారత్ బ్యాట్స్ మెన్ లలో హార్దిక్ పాండ్యా 4, దీపక్ హూడా 4, అక్షర్ పటేల్ 21 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మదుశంకా 2, కాసన్ రాజిత, హసరంగా, కరుణరత్నే ఒక్కో వికెట్ చొప్పున తీశారు. లంక బ్యాటర్లలో శానక 23 పరుగులు చేయగా, ధనంజయ 22, అసలంక 19 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3, హార్దిక్ పాండ్యా 2, ఉమ్రాన్‌ మాలిక్ 2, చాహల్ 2, అక్షర్‌ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు రోజుల అనంతరం వన్డే మ్యాచులు ప్రారంభం కానున్నాయి.

ఇవి కూడా చదవండి…

INDIA vs SRILANKA : టీమ్ ఇండియా కొంపముంచిన అర్ష్‌దీప్ సింగ్… 5 నో బాల్స్, 37 రన్స్ ?

Sania Mirza: టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్.. అదే చివరి టోర్నీ అంటూ క్లారిటీ

Waltair Veerayya : “వాల్తేరు వీరయ్య” మెగా మాస్ ఈవెంట్ కి లైన్ క్లియర్… ప్లేస్ ఫిక్స్ !

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version