South Africa win World Test Championship final by 5 wickets: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా మట్టికరిపించి కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
రెండో ఇన్నింగ్స్‌లో 282 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా సులువుగా ఛేదించింది. ఓపెనర్ మార్క్రమ్(136) సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత బపుమా(66) కీలక పాత్ర పోషించడంతో సౌతాఫ్రికా విక్టీరగా నిలిచింది. కాగా, 1998లో తొలి ఐసీసీ టైటిల్‌ను గెలుచుకున్న సౌతాఫ్రికా.. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత రెండో ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. కాగా, సౌతాఫ్రికా క్రికెట్ టీం గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీలో తడబడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చోకర్స్ అనే పేరు ముద్ర పడింది. వరుసగా తడబడటంతోపాటు గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇలా వరుస ఓటములు, కీలక మ్యాచ్‌ల్లో ఒత్తడి కారణంగా చోకర్స్ వచ్చింది. తాజాగా, ఈ విజయంతో చోకర్స్ కాదు.. విన్నర్స్ అని నిరూపించింది.
ఇప్పటివరకు మూడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ జరగగా వేర్వేరు జట్లు విజేతలుగా నిలిచారు. తొలిసారి న్యూజిలాండ్ ఈ ఘనత సాధించగా.. రెండో సారి ఆస్ట్రేలియా విక్టరీగా నిలిచింది. ఇక, తాజాగా, మూడోసారి బపుమా సారథ్యంలోని సౌతాఫ్రికా ఛాంపియన్‌గా నిలిచింది. అంతకుముందు ఆస్ట్రేలియా, భారత్ రెండు సార్లు ఫైనల్ చేరాయి. కానీ భారత్ ఫైనల్స్‌లో ఓటమి చెందింది.
ఇదిలా ఉండగా, ఐసీసీ ఫైనల్స్‌లో ఆసీస్‌ను ఓడించిన నాలుగో జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 14 ఫైనల్స్ ఆడగా.. 10 సార్లు విజయం సాధించింది. 1975 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీలో వెస్టిండీస్ గెలవగా.. 1996లో శ్రీలంక, 201లో టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్, 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో సౌతాఫ్రికా మాత్రమే ఆసీస్‌ను నిలువరించగలిగాయి.