Site icon Prime9

Satwik-Chirag: సత్తా చాటిన సాత్విక్- చిరాగ్ జోడీ

Satwik-Chirag BWF Malaysia Open 2025 Quarter-Final: భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి జోడీ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. మలేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌-1000 టోర్నీలో ఈ జోడీ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. తాజాగా జరిగిన ఈ టోర్నీలోని పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్‌ చిరాగ్‌ 3 గేమ్‌ల పాటు పోరాడారు. 57 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఈ ద్వయం 21-10,16-21,21-5 తేడాతో మింగ్‌ చి లు, కై వి టాంగ్‌ (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించారు. మరోవైపు సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ ముందంజ వేశాడు. మొదటి రౌండ్లో ప్రణయ్‌ 21-12, 17-21, 21-15తో బ్రయాన్‌ యాంగ్‌ (కెనడా)పై విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ కు అర్హత సాధించాడు.

Exit mobile version