Site icon Prime9

Rohit Sharma: ఇదే చివరి టెస్ట్ మ్యాచ్.. ఇక టెస్టులకు రోహిత్ గుడ్‌బై?

Rohit Sharma Retirement From Test: పేలవమైన బ్యాటింగ్‌తో కొంతకాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? అంటే అవుననే సూచనలు కన్పిస్తున్నాయి. ఒక సమాచారం ప్రకారం రోహిత్ శర్మ ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకోవటమే గాక తన నిర్ణయాన్ని బీసీసీఐ, సెలెక్టర్లకు చెప్పేశాడని, కానీ, కొంత కాలం వరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని వారు రోహిత్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

అయితే, తన పేలవమైన ఆటతీరు మూలంగా విమర్శలు ఎదుర్కోవటం కంటే తప్పుకోవటమే బెటరని రోహిత్ క్లారిటీకి వచ్చాడని, జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా మొదలయ్యే ఐదో టెస్ట్‌ అనంతరం తన రిటైర్మెంట్‌పై రోహిత్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Exit mobile version