Rohit Sharma Breaks Silence On ODI Retirement: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడిCయంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. దీంతో మూడోసారి భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.
అయితే, ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(76, 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడారు. ఈ సమయంలోనే వన్డేలకు రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేశాడు. తాను వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలకడం లేదని స్పష్టం చేశాడు. దీంతో గత కొంతకాలంగా వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు.
ఇక, తన కెరీర్ విషయంలో ఎలాంటి ఊహాగానాలు సృష్టించవద్దని కోరాడు. అలాగే రిటైర్మెంట్, కెరీర్ విషయాలపై రూమర్స్ ప్రచారం చేయవద్దన్నాడు. గత కొంతకాలంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు చెబుతారని ప్రచారం జరిగింది.