Site icon Prime9

Rishabh Pant: డబ్బు కోసమే కాదు.. ఢిల్లీ ఫ్రాంఛైజీని వీడటంపై రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rishabh Pant disagrees with Sunil Gavaskar: భారత వికెట్ కీపర్, కీలక బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసుకుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ రిటెన్షన్‌లో నలుగురి ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. ఇందులో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరేల్, ట్రిస్టన్ స్టబ్స్‌లు ఉన్నాయి. అయితే అప్పటినుంచి ఢిల్లీ నుంచి రిషబ్ పంత్ ఎందుకు వైదొలిగాడనే విషయాలపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

రిషభ్ పంత్ రూ.18కోట్ల కంటే ఎక్కువ ఆశించినట్లుందని సునీల్ గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అందుకే ఆయనను ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకున్నట్లు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే వచ్చే ఏడాదికి సంబంధించిన ఐపీఎల్ మెగా వేలంలో రిషభ్ పంత్‌ను మాత్రం ఢిల్లీ మళ్లీ కచ్చితంగా దక్కించుకుంటుందని వెల్లడించారు. ఢిల్లీకి ప్రస్తుతం కెప్టెన్ లేనందున రిషభ్ పంత్‌ను ఢిల్లీ తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే తాజాగా, దీనిపై రిషభ్ పంత్ ట్వీట్ చేశారు.

డబ్బు కోసమే తనను ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకోలేదని, ఇదే నిజమని రిషభ్ పంత్‌ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉండగా, పంత్.. 2016 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. ఇప్పటివరకు 2016 నుంచి 2024 వరకు 111 మ్యాచ్‌లలో 148.93 స్ట్రయిక్ రైట్‌తో 3,284 రన్స్ చేశాడు.

Exit mobile version